etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, March 18, 2019

ఆ అడవిలో అతనొక్కడే ఓటరు.. అతడి కోసం..ప్రత్యేకంగా పోలింగ్ బూత్‌

బాధ్యత గల పౌరులుగా ప్రజాస్వామ్యంలోని ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలి అని ఓటేద్దామని వెళ్తే పేరు గల్లంతు. కానీ ఆయన పేరు ఓటరు లిస్టులో ఉంది. ఆయన చూడబోతే సన్యాసం తీసుకుని అడవి బాట పట్టారు. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఉన్న గిర్ అభయారణ్యంలో ఉన్న అతడి పేరు గురు భరత్ దాస్. 20 ఏళ్లకు పైగా అడవే ఆయన నివాసం. ఫుడ్డూ బెడ్డూ అన్నీ అక్కడే. మనుషులకి దూరంగా ఉన్న గురు భరత్ దాస్.. ఫ్యాషన్‌కి మాత్రం దగ్గరగానే ఉన్నాడు. కళ్లకి గాగుల్స్, రోజూ గడ్డానికి ట్రిమ్, తలపై టోపీ, శరీరాన్ని కప్పుకోవడానికి ఓ జాకెట్. మొత్తానికి ఫ్యాషన్‌కి ఐకాన్‌గా నిలుస్తున్నాడు. మరి తన ఓటు ఎంతో అమూల్యం రాజకీయ నాయకులకి. అందుకే సిబ్బందిని ఆయన దగ్గరకే పంపించి ఓటు వేయిస్తుంది ఎలక్షన్ కమీషన్.

అడవిలో ఉన్న శివాలయంలో పూజలు చేసుకుంటూ ప్రకృతితో కాలం గడుపుతున్నారు. పండగలప్పుడు స్వామి వారిని దర్శించడానికి వచ్చే భక్తులతో అక్కడి వాతావరణం సందడిగా మారుతుంది. మిగిలిన సమయాల్లో ఆయన ఒక్కరే ఉంటున్నారన్న విషయం ప్రపంచానికి తెలిసి మీడియా ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లింది. దాంతో దాస్ పాపులర్ అయిపోయాడు. గత కొన్నేళ్లుగా ఆ ఒక్కడి కోసం ప్రత్యేకంగా పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఈవీఎం మెషిన్ల, వీవీప్యాట్ యంత్రాలు, మంచినీళ్లు, ఓటర్ల జాబితా ఇలా అన్నింటినీ తీసుకుని వెళతారు. వారికి రక్షణగా పోలీసులు కూడా తమ డ్యూటీ చేస్తారు. ఊరికి దూరంగా ఉన్న అడవిలోకి 35 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. భరత్ దాస్ కూడా ఓటు హక్కుని సంతోషంగా వినియోగించుకుంటాడు.

ఒక్క ఓటే కదా అని ఈసీ ఎప్పుడూ భావించలేదు. ఎందుకు సార్ నా ఒక్క ఓటు కోసం అంత శ్రమపడతారు అని దాస్ కూడా ఎప్పుడూ అనలేదు. ఎందుకంటే ఓటు విలువ అడవిలో ఉన్నా దాస్‌కి బాగానే తెలుసు. తనకెంతో ఇష్టమైన నాయకుడు వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటు కారణంగానే పడిపోయిందన్న విషయాన్ని భరత్ గుర్తు చేస్తుంటాడు.

The post ఆ అడవిలో అతనొక్కడే ఓటరు.. అతడి కోసం..ప్రత్యేకంగా పోలింగ్ బూత్‌ appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2W6puNz

No comments:

Post a Comment