పుల్వామా దాడి తర్వాత అరేబియా సముద్ర తీరంలో యుద్ధనౌకలను భారీగా మోహరించినట్లు భారత నావికాదళం వెల్లడించింది. విమాన వాహక నౌక ఐఎన్‌ఎ్‌స విక్రమాదిత్య సహా అణు జలాంతర్గాములు, యుద్ధ విమానాలను మోహరించినట్లు ఆదివారం ప్రకటించింది. విమాన వాహకనౌకకు రక్షణగా ఐఎన్‌ఎ్‌స చక్రాను కూడా రంగంలోకి దించినట్లు పేర్కొంది. పుల్వామా దాడికి ప్రతిగా పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేన యుద్ధ విమానాలతో దాడి చేసిన విషయం తెలిసిందే. అనంతరం పాక్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి వచ్చాయి. దీంతో త్రివిధ దళాలు అప్రమత్తమయ్యాయి. ఒకవిధంగా చెప్పాలంటే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాక్ రెచ్చగొట్టే చర్యలు చేపడితే.. గట్టిగా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాధిపతులు కూడా ప్రకటించారు.
దీంతో పాక్ యుద్ధనౌకలు మక్రాన్ కోస్ట్ దాటి బయటకు వచ్చేందుకూ సాహసించలేదని నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ తెలిపారు. ఆ సమయంలో 60 యుద్ధ నౌకలు, కోస్టు గార్డుకు చెందిన 12 నౌకలు, 60 యుద్ధ విమనాలతో నావికాదళ విన్యాసాలు(నేవీ ట్రోపెక్స్-19) జరుగుతున్నాయని, ఇరుదేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడి నుంచి నేరుగా అరేబియా సముద్రంలో ఉత్తర దిశకు యుద్ధనౌకలు చేరుకున్నాయన్నారు. మరోవైపు పాక్‌పై ఆరు క్షిపణులను ప్రయోగించేందుకు భారత్ సిద్ధమైందని, పాక్ కూడా క్షిపణులను ఎక్కుపెట్టినట్లు ఇరు దేశాలు సహా అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితి యుద్ధానికి దారితీస్తుండడంతో అమెరికా జోక్యం చేసుకుంది. దీంతో భారత్ వెనక్కి తగ్గింది. ఫలితంగా తృటిలో యుద్ధం తప్పింది.
The post భారత్-పాక్ మధ్య త్రుటిలో తప్పిన యుద్ధం, సంచలన విషయాలు చెప్పిన భారత నావికాదళం. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2CrNiEc
No comments:
Post a Comment