వివేకా హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. సిట్ ఆధ్వర్యంలో ఐదు బృందాలు, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏడు బృందాల దర్యాప్తు చేస్తున్నాయి. ఘటనా స్థలంలో సాక్ష్యాలతో పాటు ఫోరెన్సిక్, సాంకేతిక సాక్ష్యాలను పోలీస్ బృందాలు సేకరించాయి. హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారనే అంశంపై దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి. ఇప్పటి వరకు 20 మందిని పోలీసులు విచారించారు. వివేకా రాసినట్టు చెబుతున్న లేఖను పోలీసులకు ఇవ్వడంలో జాప్యంపై ఆరా తీశారు. వివేకా మరణవార్త తెలిపిన వెంటనే పీఏ కృష్ణారెడ్డి, వాచ్‌మన్ రంగన్న, దొండ్లబాడు శంకర్‌రెడ్డి, ఎర్రా గంగిరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, గంగిరెడ్డి ఆస్పత్రి కాంపౌండర్ ప్రకాశ్‌రెడ్డి, డా. నాయక్, వైఎస్ అవినాశ్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చారని నిర్ధారణ అయింది.
పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేసరికి బెడ్‌రూంను శుభ్రం చేయడం, బాత్‌రూం నుంచి మృతదేహాన్ని బెడ్‌రూంలోకి మార్చారని దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి. గాయాలకు గంగిరెడ్డి ఆస్పత్రి సిబ్బంది బ్యాండేజ్ వేశారని వెల్లడైంది. వివేకా రక్తపు వాంతులు చేసుకుని బాత్‌రూంలో కమోడ్ పైనుంచి పడిపోయి, గాయాలతో మరణించారని అక్కడికి వచ్చినవారికి బంధువులు చెప్పినట్టు దర్యాప్తులో తేలింది. వివేకానందరెడ్డి రాసిన లేఖను తాను వచ్చిన తర్వాతే పోలీసులకు ఇవ్వాలని కుమార్తె కోరిందని పీఏ కృష్ణారెడ్డి దర్యాప్తు బృందాలకు వెల్లడించారు.
The post వివేకా హత్య కేసు దర్యాప్తులో వెలుగులోకొచ్చిన కీలక విషయాలివే..! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Jl8UZ0
No comments:
Post a Comment