etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, March 27, 2019

కాఫీ తోట వివాదంలో కన్నడ హీరో సుదీప్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌

కన్నడ హీరో, ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాఫీ ఎస్టేట్‌ వివాదంలో కోర్టుకు గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. చిక్‌మంగళూరు కోర్టులో వరుస వాయిదాలతో అవకాశమిచ్చినా ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాకపోవడంతో సుదీప్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు చిక్‌మంగళూరు జెఎంఎఫ్‌సీ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. మే 22వ తేదీ లోగా సుదీప్‌ ఆచూకి తెలుసుకొని కోర్టు ముందు హాజరు పరచాల్సిందిగా కర్ణాటక పోలీసులను ఆదేశించిందిజ ప్రస్తుతం ఆ వార్త శాండల్‌వుడ్ ఇండస్ట్రీ హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

కర్ణాటక చిక్‌మంగళూరులోని కాఫీ ప్లాంటేషన్ యజమాని దీపక్ పటేల్ ఫిర్యాదు మేరకు నటుడు సుదీప్, కన్నడ టీవీ రియాలిటీ షో సుదీప్‌కు చెందిన ప్రొడక్షన్‌ హౌస్‌ కిచ్చా క్రియేషన్స్‌పైనా, డైరెక్టర్ మహేష్‌లపై కేసు నమోదైంది. 2016లో కన్నడ టీవీ షో వారసదార షూటింగ్‌ కోసం తన ఎస్టేట్‌ను అద్దెకు తీసుకొన్నారు. ఇందుకు కోటి 80 లక్షల రూపాయలను చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌ రూ. 50 వేలు మాత్రమే ఇచ్చి మిగతా సొమ్మును ఎగ్గొట్టారని, అలాగే తన కాఫీ తోటల్ని, మరికొంత వారసత్వ ఆస్తిని ధ్వంసం చేశారని దీపక్‌ ఆరోపించారు. ఒప్పందానికి భిన్నంగా లోపల ఒక సెట్‌ను కూడా నిర్మించారనీ, తనకు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించకుండా మోసం చేశారంటూ మొదట జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. అయితే ఇది సివిల్‌ వివాదం కావడంతో ఎస్పీ సలహా మేరకు కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు కాఫీ ఎస్టేట్ ఓనర్ దీపక్‌. ఈ కేసులో విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడనేది ప్రధాన ఆరోపణ.

The post కాఫీ తోట వివాదంలో కన్నడ హీరో సుదీప్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2HWCAcz

No comments:

Post a Comment