పామును దగ్గర నుంచి చూస్తేనే చాలా మందికి భయమేస్తుంది. అలాంటిది అమెరికాలో ఓ వ్యక్తి ఏకంగా పామును దొంగతనం చేసి ప్యాంటులో దాచుకుని వెళ్లాడు. మిచిగాన్‌కు చెందిన వ్యక్తి పాములకు సంబంధించిన ఓ దుకాణానికి వెళ్లి అక్కడ ఓ నాలుగు అడుగుల కొండచిలువను చూశాడు. అది నచ్చడంతో దుకాణదారులకు తెలియకుండా దాన్ని ఎత్తుకెళ్లాలనుకున్నాడు. ఎలా తీసుకెళ్లాలని ఆలోచించి.. చివరకు కొండచిలువను తన ప్యాంటు లోపలే దాచాడు. వ్యక్తి వెళ్లిపోయిన తరువాత కొండచిలువ కనపడకపోవడంతో ఉద్యోగులు సీసీ కెమెరాలను పరిశీలించారు. వ్యక్తి చేసిన పనిని చూసి వారందరూ షాకయ్యారు. పామును ప్యాంటులో పెట్టుకుని వెళ్లే వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ కొండచిలువ ఒకరోజు ముందే అక్కడకు వచ్చిందని.. మరుసటి రోజు దాన్ని మరోచోటికి తరలించాల్సి ఉందని దుకాణ యజమాని తెలిపారు. వెంటనే వ్యక్తిపై రాక్‌వుడ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పామును దొంగిలించిన వ్యక్తి ఆచూకి తెలిస్తే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పోలీసులు కోరారు.
The post కొండచిలువను దొంగతనం చేసి.. ఎక్కడ పెట్టాలో తెలీక.. ప్యాంటు లోపల పెట్టుకున్నాడు.. తరువాత…! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2CHZdhs
No comments:
Post a Comment