etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, March 28, 2019

పబ్‌జీ గేమ్‌కు బానిసయ్యారా? ఈ టిప్స్‌తో పబ్‌జీ బారి నుంచి తప్పించుకోండి..!

రేయ్.. వాడిని ఎందుకు చంపావురా.. అరేయ్.. వెనక చూసుకోరా. వాడు చంపేస్తాడురా నిన్ను. ఆ ఇంట్లోకి పోయి గన్స్ తీసుకోరా? చంపేయ్‌రా వాడిని.. యస్.. విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్.. ఏంటి ఇదంతా అని అనుకుంటున్నారా? ఎవరైనా స్మార్ట్‌ఫోన్ పట్టుకొని చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బిజీబిజీగా ఏదో పొడుస్తున్నట్టుగా కనిపిస్తారు చూశారా? వాళ్లు మాట్లాడే మాటలు ఇవే. ఇప్పటికే మీకు అర్థమయిపోయి ఉంటుంది. మేము దేని గురించి మాట్లాడుతున్నామో. పబ్‌జీ గేమ్ గురించే మాట్లాడేది. నేటి యువత ఈ గేమ్‌కు బాగా బానిసయిపోయింది. యువతే కాదు.. స్కూల్ విద్యార్థులు కూడా ఈ గేమ్‌కు బాగా అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆ గేమ్ నుంచి బయటపడాలంటే సప్తసముద్రాలు ఈదినంత. డ్రగ్స్ కన్నా డేంజర్ పబ్‌జీ గేమ్. దాన్ని వదిలించుకోవడం అంత ఈజీ కాదు. అయినప్పటికీ.. కొన్ని టిప్స్‌ను సీరియస్‌గా పాటిస్తే పబ్‌జీ బారి నుంచి తప్పించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి.

డిజిటల్ వెల్‌బీయింగ్

ఆండ్రాయిడ్ పై ఓఎస్ ఉన్నవాళ్లు డిజిటల్ వెల్‌బీయింగ్ టూల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ టూల్‌ను గూగుల్ డెవలప్ చేసింది. దీని వల్ల స్మార్ట్‌ఫోన్‌లో మీరు రోజులో ఎంత సమయం గడుపుతున్నారు.. అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఎంతసేపు స్మార్ట్‌ఫోన్‌లో గడపాలో దీని ద్వారా సెట్ చేసుకోవచ్చు. ప్రతి యాప్ మీద రిపోర్ట్స్ కూడా పొందొచ్చు. ఉదాహరణకు పబ్‌జీ యాప్‌ను రోజుకు మీరు 15 నిమిషాల పాటే ఉపయోగించాలనుకున్నారనుకోండి. అప్పుడు డిజిటల్ వెల్ బీయింగ్ యాప్ ద్వారా 15 నిమిషాలు టైమ్ సెట్ చేసుకోవాలి. 30 నిమిషాలు, గంట, రెండు గంటలు.. ఇలా మీకు నచ్చిన సమయాన్ని సెట్ చేసుకోవాలి. టైమ్ అయిపోగానే మీరు ఉపయోగించే యాప్ ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది. అయితే.. గూగుల్ పైని సపోర్ట్ చేసే ఫోన్లలో మాత్రమే డిజిటల్ వెల్‌బీయింగ్ పనిచేస్తుంది. ఒకవేళ గూగుల్ పై ఓఎస్ లేని యూజర్లు… డిజిటల్ వెల్‌బీయింగ్‌ను పోలిన యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యాక్షన్ డ్యాష్

డిజిటల్ వెల్‌బీయింగ్ లాంటి యాపే ఇది కూడా. అయితే ఈ యాప్‌లో టైమ్ లిమిట్ ఫీచర్ లేనప్పటికీ… వారాంతపు రిపోర్టులను యాక్షన్ డ్యాష్ ద్వారా పొందొచ్చు. మీరు ఒక వారంలో పబ్‌జీని ఎంత సేపు ఆడారో ఇది రిపోర్టు ఇస్తుంది. ఆ రిపోర్టు ప్రకారం మీరు పబ్‌జీ ఆడే సమయాన్ని కుదించుకోవచ్చు.

స్పేస్

మీరు పెట్టుకున్న టైమ్ లిమిట్ దాటితే స్పేస్ మీకు అలర్ట్ పంపిస్తుంది. అలర్ట్ రాకముందే… టైమ్ లిమిట్ దాటకముందే మీ లక్ష్యాలను పూర్తి చేస్తే స్పేస్ మీకు రివార్డ్స్ కూడా అందిస్తుంది. దీని వల్ల ముందే టైమ్ ఫిక్స్ చేసుకొని ఆ టైమ్ లిమిట్‌లోనే గేమ్ ఆడే వీలు ఉంటుంది. తద్వారా ఎక్కువ సమయం వృథా కాకుండా ఉంటుంది.

యాప్ డిటోక్స్

ఫోన్ వాడకాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం యూజర్లకు చాలా ఆప్షన్లను ఇస్తుంది యాప్ డిటోక్స్. ఎలా అంటే.. మీరు రోజూ నడవాలనుకుంటారు. ఒకరోజు టైమ్ ఫిక్స్ చేస్తారు. ఒకరోజు వాకింగ్ చేస్తారు. రెండో రోజు చేయరనుకోండి. మీరు సెట్ చేసుకున్న ఆ యాప్‌ను ఉపయోగించకుండా ఆపేస్తుంది యాప్ డిటోక్స్. అలాగే పబ్‌జీ గేమ్‌పై ఒక్కసారి మీరు టైమ్ లిమిట్ పెట్టుకున్నాక.. రెండోసారి కూడా అలాగే ఆ టైమ్ లిమిట్‌లోనే గేమ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టైమ్ లిమిట్ దాటితే పబ్‌జీ యాప్‌ను మీరు ఉపయోగించకుండా యాప్‌ను ఆపేస్తుంది డిటోక్స్.

స్క్రీన్ టైమ్

డిజిటల్ వెల్‌బీయింగ్ లాంటి యాపే ఇది కూడా. ఉదాహరణకు ఐఫోన్ యూజర్ తన స్మార్ట్‌ఫోన్‌ను రోజుకు ఎంతసేపు ఉపయోగిస్తున్నాడో తెలుసుకోవడం కోసం స్క్రీన్ టైమ్ అనే యాప్‌ను సెలెక్ట్ చేసుకుంటాడు. సెట్టింగ్స్ మెనూలోకి వెళ్తే స్క్రీన్ టైమ్ ఆప్షన్‌కు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐఫోన్ యూజర్లు డౌన్‌టైమ్ షెడ్యూల్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇతర యాప్స్‌కు టైమ్ లిమిట్ పెట్టుకోవచ్చు. స్క్రీన్ టైమ్ ఆప్షన్ ఐఓఎఓస్ 12 వాళ్లకే అందుబాటులో ఉంటుంది. పబ్‌జీ యూజర్లు కూడా స్క్రీన్ టైమ్‌లో టైమ్ లిమిట్ సెట్ చేసుకోవచ్చు.

The post పబ్‌జీ గేమ్‌కు బానిసయ్యారా? ఈ టిప్స్‌తో పబ్‌జీ బారి నుంచి తప్పించుకోండి..! appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2U3FKlZ

No comments:

Post a Comment