మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. స్వగృహంలోనే బాత్రూంలో మృతి చెంది ఉండగా కుటుంబ సభ్యులు గుర్తించారు. అంతకుముందే ఓసారి గుండెపోటు రావడంతో స్టెంట్లు వేయించుకున్నారు. అయినప్పటికీ అకాల మరణం చెంది కుటుంబ సభ్యులకు శోకం మిగిల్చారు. ఎన్నికల ప్రచారంలో గురువారం కూడా పాల్గొన్న ఆయన… ఇకలేరు అనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు వారు చేసుకుంటున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు. వైసీపీ అధినేత జగన్‌కు ఆయన స్వయానా బాబాయి. వైఎస్‌తోపాటు కాంగ్రెస్‌తోనే రాజకీయ జీవితాన్ని వివేకానందరెడ్డి ప్రారంభించారు. 1999లో కడప ఎంపీగా ఆయన గెలిచారు. 2004లో కూడా ఎంపీగా గెలిచి కడప ప్రజలకు సేవలందించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో.. ఆ సీటును త్యాగం చేశారు. 2009లో జగన్ కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అదే ఏడాది వివేకాను ఎమ్మెల్సీ పదవి వరించింది. ఆ తర్వాత హెలీకాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు.
కాంగ్రెస్ నుంచి రోశయ్య, ఆ తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి అనూహ్యంగా ముఖ్యమంత్రులయ్యారు. 2010లో కిరణ్ కేబినెట్‌లో వైఎస్ వివేకా వ్యవసాయ శాఖ మంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత రెండేళ్లకే కాంగ్రెస్‌కు జగన్ గుడ్‌బై చెప్పారు. వైఎస్ పథకాలకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తిలోదకాలిస్తోందంటూ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకున్నారు. స్వయానా అన్న కుమారుడు సొంత పార్టీ పెట్టుకున్నా.. వైఎస్ వివేకా కాంగ్రెస్‌ను వీడలేదు. జగన్‌కు మద్దతుగా మరి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. దీంతో ఆ ఏడాది ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో తన బలమెంతో నిరూపించాలని వైఎస్ వివేకా నిర్ణయించుకున్నారు. పులివెందులలో వైఎస్ విజయమ్మపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. 2011లో వచ్చిన ఉప ఎన్నికల్లో పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయమ్మ పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ వివేకానందరెడ్డి బరిలోకి దిగారు.
కన్నతల్లి లాంటి వదినపై పులివెందులలో పోటికి దిగడం ఏంటని అంతా ప్రశ్నిస్తే.. వైఎస్ వివేకా ఘాటుగానే సమాధానమిచ్చారు. ‘పులివెందులలో పోటీ చేయడం ద్వారా మంత్రి పదవిలో కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. పులివెందుల ప్రజలకు సమాధానంగా ఉండాలనే పోటీ చేస్తున్నా. కుటుంబం గురించి బాధపడేకంటే.. ప్రజలకోసం పనిచేయాలనే అనుకున్నా. ఈ సెంటిమెంట్లతో ప్రజలను మభ్యపెట్టాలనుకుంటే.. మేమూ చేయాల్సి వస్తుంది. కొడుకు లాంటి నా మీద వదిన పోటీ చేయడమేంటని మేమూ అనాలి. సెంటిమెంట్లు లేవు.. రాజకీయాలు రాజకీయాలే…’ అని నాడు వివేకానందరెడ్డి తేల్చిచెప్పారు. ఆ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా పరాజయం పాలవడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ పార్టీలోకి ఆయన చేరడం వెంటవెంటనే జరిగిపోయాయి.
The post నాడు విజయమ్మపై పోటీ చేసిన వైఎస్ వివేకానందరెడ్డి, దానికి కారణం ఇదే. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2XVB3cp
No comments:
Post a Comment