కీడ్నీలు మన బాడీలోకెల్లా చాలా సెన్సిటివ్ అని చెప్పుకోవాలి. ఇవి ఎన్నో అనారోగ్య, రోగకారక వ్యర్థాలను బయటకు పంపించి మన శరీరానికి ఇన్ఫెక్షన్స్ రాకుండా అడ్డుకుంటాయి. కిడ్నీల ఫంక్షనింగ్ లో ఏమాత్రం తేడా వచ్చినా ఇన్ఫెక్షన్లు, స్టోన్స్ అంటూ పలురకాల సమస్యలు ఒకేసారి దాడి చేయవచ్చు. అందులో కీడ్నిల్లో రాళ్ళు రావడం అనేది ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపించే సమస్య. మన ఇంటి దగ్గరో, చుట్టాల్లోనో .. ఇలాంటి సమస్యతో బాధపడేవారిని చూస్తుంటాం. ఇలా జరిగినప్పుడు డాక్టర్ ని సంప్రదించడం అనివార్యమే అయినా, మనవంతుగా కూడా ప్రయత్నంచేస్తే చాలా వరకు నయం చేసుకోవచ్చు. మేం ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ తాగితే కిడ్నీల్లో రాళ్లను ఈజీగా కరిగించుకోవచ్చని ప్రయోగాత్మకంగా రుజువైంది. ఇంతకూ ఏం చేయాలో కింద తెలుసుకోండి..
కిడ్నీల్లో రాళ్లు కరిగించే జ్యూస్:
* ఈ స్పెషల్ జ్యూస్ తయారి కోసం నిమ్మకాయలు, ఆలీవ్ ఆయిల్, దానిమ్మ అవసరం.
* ఓ కప్పు తీసుకొని దాంట్లో ముప్పావు శాతం దాన్నిమ్మ రసం పిండాలి.
* తర్వాత రెండు టీ స్పూన్ల నిమ్మరసం, ఒక టీస్పూను ఆలివ్ ఆయిల్ పోసి బాగా కలపాలి. అంతే కిడ్నీల్లో రాళ్లు కరిగించే జ్యూస్ రెడీ.
* దీన్ని రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కి ముందు తీసుకుంటే సరిపోతుంది.
* క్రమం తప్పకుండా తాగేలా అలవాటు పడండి.. కిడ్నీల్లో రాళ్లు అనే సమస్యే ఉండబదు.
* ఈ జ్యూస్ కిడ్నీల్లోని టాక్సిన్స్ ని వదిలిస్తుంది. అంతే కాకుండా దీంట్లో ఉన్న ఆసిడిక్ లక్షణాలు రాళ్ళను కరిగించేందుకు సహాయపడతాయి.
The post సర్జరీ లేకుండానే కిడ్నీలో రాళ్ళను తొలగించుకోవాలంటే ఇలా చేయండి..! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2T6yK2n
No comments:
Post a Comment