etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, March 18, 2019

డిగ్రీ అర్హతతో నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం..చివరితేది ఎప్పుడో తెలుసా …?

ఇండియన్ నేవీలో ఎస్ఎస్‌సీ (షార్ట్ సర్వీస్ కమిషన్), పర్మినెంట్ కమిషన్ విభాగాల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఎంపికైన అభ్యర్థులకు ఎజిమల (కేరళ)‌లో శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సబ్ లెప్టినెంట్ హోదాలో నియమిస్తారు. వీరికి నిబంధనల మేరకు జీతభత్యాలు అందుతాయి.
ఖాళీల సంఖ్య: 53

పోస్టులు..

అబ్జర్వర్: 06
పైలట్(ఎంఆర్): 08
లాజిస్టిక్స్ : 15
ఎడ్యుకేషన్: 24
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంఏ, ఎంబీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: పైలట్, అబ్జార్వర్ పోస్టులకు 02.01.1996 – 01.01.2001 మధ్య జన్మించి ఉండాలి.
లాజిస్టిక్స్ పోస్టులకు 02.01.1995 – 01.06.2000 మధ్య జన్మించి ఉండాలి.
ఎడ్యుకేషన్ పోస్టులకు 02.01.1995 -01.01.1999 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, పీఏబీటీ (పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్), మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా
ఎంపికైన వారికి ఎజిమలలో శిక్షణ అనంతరం నేవీలో సబ్ లెప్టినెంట్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.
పైలట్ పోస్టులకు 22 వారాల నేవల్ ఓరియంటేషన్ కోర్సు ఉంటుంది. స్టేజ్-1, స్టేజ్-2 ప్లైయింగ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. శిక్షణ పూర్తిచేసిన వారికి పైలట్‌గా బాధ్యతలు అప్పగిస్తారు.
అబ్జార్వర్ పోస్టులకు కూడా 22 వారాల పాటు నేవల్ ఓరియంటేషన్ కోర్సులో శిక్షణ ఇస్తారు. అనంతరం అబ్జార్వర్ స్కూల్‌లో సబ్ లెప్టినెంట్ టెక్ (X) కోర్సులో శిక్షణ ఉంటుంది. అనంతరం ఉద్యోగ నియామకం ఉంటుంది.
లాజిస్టిక్స్/ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు కూడా 22 వారాల నేవల్ ఓరియంటేషన్ కోర్సులో తరగతులు నిర్వహిస్తారు. అనంతరం ఎయిర్ ఫోర్స్ అకాడమీతో పాటు, నేవీకి సంబంధించిన వివిధ అంశాల్లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.03.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:05.04.2019

The post డిగ్రీ అర్హతతో నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం..చివరితేది ఎప్పుడో తెలుసా …? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2OeNaNi

No comments:

Post a Comment