మారిన జీవన విధానం అనేక ఆనారోగ్యాలకు దారి తీస్తుంది. పొద్దున్న లేస్తే ఉరుకుల పరుగుల జీవితం, నైట్ డ్యూటీలు, సమయానికి ఆహారం తీసుకోలేకపోవడం, పని ఒత్తిడి కొన్ని రోగాలకు కారణమైతే, మరికొన్ని వంశపారంపర్యగా వస్తున్న జబ్బులు ఇప్పుడు మరీ చిన్న వయసులోనే దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్(మధుమేహం) మరిన్ని వ్యాధులకు కారణమవుతుంది. సరైన సమయంలో మధుమేహాన్ని గుర్తించడం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకోగలుగుతారు. వ్యాధిని మరీ తీవ్రతరం కాకుండా కంట్రోల్‌లో ఉంచేందుకు ఎన్ని మందులు వాడినా మనం కూరగా వాడే కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతూ ప్రభావవంతంగా పనిచేస్తుంది.
రోజుకి ఒకసారి కాకరకాయ జ్యూస్ తాగితే మంచిది. ఈ రసంలో శరీరానికి పనికి వచ్చే విటమిన్లు, ఖనిజలవణాలు, పీచు పదార్థం ఉండడం వలన బరువు తగ్గించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాకరకాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉండడం వలన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వయసు కారణంగా వచ్చే చర్మ మార్పుని నిరోధిస్తుంది. అలాగే శరీరంలో వాపులు రాకుండా కాపాడుతుంది. అయితే ఈ రసాన్ని ఎప్పుడు తాగాలి.. ఎలా చేసుకోవాలి వంటి విషయాలు తెలుసుకుందాం.. కాకరకాయ రసాన్ని పరగడుపున, ఖాళీ కడుపుతో తాగాలి. ఎసిడిటీ (కడుపులో మంట, గ్యాస్)తో బాధపడుతున్నట్లైతే మధ్యాహ్నం భోజనం తరువాత ఈ రసాన్ని తీసుకోవాలి.
కాకర కాయ రసం తయారీకి కావలసిన పదార్థాలు..
కాకర కాయలు : 1 లేదా 2
నిమ్మకాయ: అర ముక్క
పసుపు: పావు చెంచా
ఉప్పు : చిటికెడు
తయారు చేసే విధానం..
కాకర కాయలు తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత పైన బుడపెలులా ఉన్నవాటిని తొలగించాలి. లోపలి గింజలను కూడా తీసెయ్యాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి గిన్నెలో వేయాలి. అందులోనే చిటికెడు ఉప్పు వేసి 10 నిమిషాలు నీళ్లలో నానబెట్టి మిక్సీ పట్టాలి. రసం తీసి దాన్ని వడగట్టి అందులో పసుపు, నిమ్మరసం కలిపి తాగాలి. గ్లాసు కాకరకాయ జ్యూస్‌లో 11 రకాల క్యాలరీలు, 0.1 గ్రా. కొవ్వు, 0.7 గ్రా ప్రొటీన్, 1.7 గ్రా పీచుపదార్థం ఉంటుంది.
The post ప్రతి రోజు ఉదయానే కాకరకాయ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలు తెలుసా..! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2FjqEQm


No comments:
Post a Comment