etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, March 18, 2019

సిక్సర్ కొట్టకుంటే …నాగిని డాన్స్ చూడలేక చచ్చేవాళ్ళం..‘ఆ మ్యాచ్‌.. ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే’

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున క్రికెటర్‌ విజయ్‌ శంకర్‌ను తిట్టకుండా.. దినేశ్‌ కార్తీక్‌ను పొగడుకుండా ఉండని అభిమాని ఉండకపోవచ్చు. ఎందుకంటే సులువుగా గెలిచే మ్యాచ్‌ను ఓటమి అంచుకు శంకర్‌ తీసుకరాగ.. ఇక ఓటమి ఫిక్స్‌ అనుకున్న తరుణంలో మ్యాచ్‌ను గెలిపించి అభిమానుల ముఖంలో చిరునవ్వు కలిగిలే చేశాడు దినేశ్‌ కార్తీక్‌. నిదహాస్‌ ట్రోఫి ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి బంతికి సిక్సర్‌ కొట్టి బంగ్లాదేశ్ నుంచి మ్యాచ్‌ను, టీమిండియా పరువును దినేశ్‌ కార్తీక్‌ కాపాడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌ జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ఆ మ్యాచ్‌కు సంబంధించిన విషయాలను నెమరు వేసుకుంటున్నారు. ఆ మ్యాచ్‌.. ఇంకా నా కళ్ల ముందు కదలాడుతూనే’ ఉందంటూ ఓ నెటిజన్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ‘కార్తీక్‌ భయ్యా సిక్సర్‌ కొట్టకుంటే.. నాగిని డ్యాన్స్‌ చూడలేక చచ్చేవాళ్లం’అంటూ మరో అభిమాని కామెంట్‌ చేశాడు.

ఇక ఆ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బంగ్లా బ్యాట్స్‌మన్‌ షబ్బీర్‌ రహ్మాన్‌(77) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియాకు ఏదీ కలసి రాలేదు. రోహిత్‌ శర్మ అర్ధ సెంచరీతో రాణించగా.. ధవన్, రైనాలు విఫలమయ్యారు. ఈ తరుణంలో 14వ ఓవర్లో 98/4తో ఉన్న దశలో క్రీజ్‌లోకి వచ్చిన శంకర్.. అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 3 ఓవరల్లో 35 పరుగులు చేయాల్సిన దశలో ముస్తాఫిజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో సింగిల్ కూడా తీయలేకపోయాడు. ఈ దశలో దినేశ్ కార్తీక్ 8 బంతుల్లో 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. ఆ మ్యాచ్‌లో శంకర్ 19 బంతుల్లో 17 రన్స్ మాత్రమే చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.

The post సిక్సర్ కొట్టకుంటే …నాగిని డాన్స్ చూడలేక చచ్చేవాళ్ళం..‘ఆ మ్యాచ్‌.. ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే’ appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2CpN1lg

No comments:

Post a Comment