దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు. రామ్‌చరణ్ అల్లూరి సీతారామ రాజుగా, తారక్ కొమురం భీమ్‌గా ఈ మూవీలో కన్పించనున్నారు. ఇక ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గార్‌జోన్స్, రామ్ చరణ్ జోడీగా అలియా భట్ నటిస్తున్నారు. 2020లో ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.
ప్రస్తుతం ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ ‘‘ఆర్ఆర్ఆర్’’ పేరుతో రూపొందుతోంది. మొత్తం నాలుగు భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి ఒకే టైటిల్ పెట్టాలని దర్శకుడు రాజమౌళి నిర్ణయం తీసుకున్నారు. అది కూడా అభిమానుల ఎంపిక చేసిన టైటిల్‌నే ఈ చిత్రానికి పెట్టాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు స్టోరీకి తగ్గట్టుగా #RRRTITLE పేరుతో టైటిల్స్ పంపాలని చిత్ర బృందం అభిమానులను కోరింది. దీంతో చాలా టైటిల్స్ వెల్లువెత్తాయి. ‘రామ రాజుల రణం’, ‘రణ రంగ రారాజులు’, ‘రఘుపతి రాఘవ రాజారాం’, రౌద్ర రణరంగం’, ‘రామ రాజుల రాజసం’ లాంటి పేర్లను అభిమానులు, నెటిజన్లు పోస్ట్ చేశారు. ఈ టైటిల్స్‌ను చిత్రం బృందం పరిశీలిస్తోంది. అయితే మరిన్ని టైటిల్స్‌ను కూడా పరిశీలించాలని భావిస్తోంది. ఇంకా టైటిల్స్ పంపిస్తే వాటిలో మంచి టైటిల్‌ను ఎంపిక చేసి సినిమాలో వాడతామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
The post ‘‘ఆర్ఆర్ఆర్’’కు వెల్లువెత్తుతున్న టైటిల్స్…మరిన్ని పంపాలని ఆహ్వానం… appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2UDKbjv
No comments:
Post a Comment