etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, March 17, 2019

దీర్ఘకాల అనారోగ్యంతో గోవా సీఎం పారికర్‌ కన్నుమూత.

దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నగోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ (63) కన్నుమూశారు. ఆదివారం రాత్రి ఆయన మరణించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఇవాళ సాయంత్రం పారికర్‌ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, డాక్టర్లు తమ శాయశక్తులా ఆయనకు వైద్యం అందిస్తున్నారని గోవా సీఎంవో ట్వీట్‌ చేసింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే పారికర్‌ మరణవార్త వినాల్సి వచ్చింది. ప్యాంక్రియాటిక్‌ వ్యాధితో బాధపడుతున్న పారికర్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌, గోవా, ముంబైలోనూ చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికాలో సుదీర్ఘ చికిత్స తీసుకున్నా అయినా ఫలితం లేకపోయింది.

కొంత కాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. అలాంటి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది జనవరి 30న అసెంబ్లీలో పారికర్‌ బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ మృతి చెందారు. 1955 డిసెంబర్‌ 13న గోవాలో జన్మించిన పారికర్‌ ఐఐటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన ఆయన 1994లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999లో గోవా అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్నారు. 2000లో తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన పారికర్‌…. ప్రధాని మోదీ కేబినెట్‌లో రక్షణమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పారికర్‌ హయాంలోనే ఫ్రాన్స్‌తో రఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందం జరిగింది.

The post దీర్ఘకాల అనారోగ్యంతో గోవా సీఎం పారికర్‌ కన్నుమూత. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2Y2Wl7U

No comments:

Post a Comment