etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, March 19, 2019

ఓటర్లకు సినిమా చూపిస్తున్న నేతలు.. కూల్‌డ్రింక్స్, సమోసాలు ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..

చంద్రగిరిలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు వైసీపీ నేతలు. ఓటర్లను ఫ్రీగా ధియేటర్లకు తీసుకెళ్లి, సినిమా చూపించి తిరిగి ఇళ్లకు తీసుకొస్తున్నారు. ఇంటర్వెల్‌లో కూల్‌డ్రింకులు, సమోసాలు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇదంతా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వర్గీయులే చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. తిరుపతి నగరంలోని కొన్ని ధియేటర్లలో ఓటర్ల కోసం ఫ్రీ షోలు వేస్తున్నారు. గ్రామాల్లో ప్రజల్ని యాత్ర సినిమాకు తీసుకెళ్లి అక్కడ ఎమోషనల్‌గా వాళ్లను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 3 రోజుల వరకూ అన్ని టికెట్లు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వైసీపీ నేతలు.. ప్రలోభాలకు తెర తీశారని అంటున్నారు. ఓటర్లకు గాలమేస్తున్న వైసీపీ తీరు టీవీ5 కెమెరాకి కూడా చిక్కింది. ఐతే.. ఈ తరహా ప్రలోభాలపై ఎన్నికల అధికారులు దృష్టిపెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.

The post ఓటర్లకు సినిమా చూపిస్తున్న నేతలు.. కూల్‌డ్రింక్స్, సమోసాలు ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2Fe8FJM

No comments:

Post a Comment