etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, March 19, 2019

వీడిన ఉత్కంఠ.. అన్నయ్య‌లాగే తమ్ముడు రెండు చోట్ల పోటీ, ఎక్కడెక్కడో తెలుసా …?

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడ పోటీ చేస్తారన్న ఉత్కంఠ వీడింది. సేమ్‌ అన్నయ్య చిరంజీవిలాగే రెండు చోట్ల పోటీ చేయాలని నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాకల నుంచి పోటీ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు.. పార్టీ ప్రారంభించినప్పటినుంచి పవన్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇవాళ జరిగిన జనరాల్‌ బాడీ సమావేశం తరువాత తాను పోటీ చేస్తున్న స్థానాలపై క్లారిటీ ఇచ్చారు. అన్న చిరంజీవి బాటలోనే తమ్ముడు పవన్‌ కూడా నడిచారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. ఆయన తిరుపతి, పాలకొల్లులో నిలబడ్డారు. అయితే తిరుపతిలో గెలిచి.. పాలకొల్లులో ఓడిపోయారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు.

అన్నయ్యలాగే రెండు చోట్ల పోటీ చేయాలనుకున్న ఆయన.. భీమవరం, గాజువాకలను ఎంచుకున్నారు. జనసేన అభిమానులు, కార్యకర్తలు అంతా ఆ రెండు చోట్ల పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే భీమవరం కన్నా.. గాజువాక తనకు బెటర్‌ ప్లేస్‌ అని పవన్‌ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. గాజువాకలో రూరల్ ఓటర్లతో పాటు అర్బన్ ఓటర్లు కూడా ఎక్కువే ఉన్నారు. అన్నింటికి మించి విశాఖలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. జనసేన ఎక్కువ సభ్యత్వాలు కూడా గాజువాక నుంచి ఉన్నాయి. ఇక కాపు ఓటర్లు – తన అభిమానులు – జనసేన కార్యకర్తలు ఎలా చూసుకున్నా గాజువాక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సరిగ్గా సరిపోయే సీటు అని పవన్ అభిమానులు భావిస్తున్నారు. అందుకే ఆయన గాజువాకని ఎంచుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

The post వీడిన ఉత్కంఠ.. అన్నయ్య‌లాగే తమ్ముడు రెండు చోట్ల పోటీ, ఎక్కడెక్కడో తెలుసా …? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2OaA0k6

No comments:

Post a Comment