‘‘తుదిశ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటా’’.. ఏ నిమిషంలో ఈ మాటలు అన్నారో.. గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్ జీవితంలో అవే నిజమయ్యాయి. తథాస్తు దేవతలు విన్నారా అన్నట్టు.. ఆయన చివరి శ్వాస వరకు ప్రజాజీవితంలోనే ఉన్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్చైన ఆయన.. ముక్కుకు ట్యూబ్‌తోనే అసెంబ్లీకి వచ్చారు. జనవరి 30న బడ్జెట్ ప్రవేశపెడుతూ.. ‘‘నేను ఫుల్ జోష్‌లో ఉన్నాను. ఇవాళ మరోసారి వాగ్దానం చేస్తున్నాను. నీతి, నిజాయితీ, అంకితభావంతో తుదిశ్వాస వరకు గోవా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను’’ అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. గోవా ప్రజలను అమితంగా ఇష్టపడే ఆయన.. మాతృభూమి సేవలో నిజంగానే తరించారు. ఆయన అన్న మాట ప్రకారమే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే కన్నుమూశారు.
‘‘పర్రీకర్ నిరాడంబరత, అంకితభావం ప్రశ్నించలేనివి. రక్షణమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా.. ఆయన మనసు ఎప్పుడూ గోవా ప్రజల చుట్టే తిరిగేది.’’ పర్రీకర్‌ను గుర్తు చేసుకుంటూ.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆరోగ్యం క్షీణించి .. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నా.. గోవా ప్రజల బాగోగుల గురించే ఆలోచించారు తప్ప.. మరొకటి లేదని ఆయన సన్నిహితులు అంటుంటారు.
The post పర్రీకర్ మాటలను తథాస్తు దేవతలు విన్నారా..! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2FdAlyo
No comments:
Post a Comment