గుంటూరు వెస్ట్ టిక్కెట్ ను హీరోయిన్ మాధవీలతకు కేటాయించింది బీజేపీ.. ఇక్కడనుంచి గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ పోటీ చేశారు. ఈసారి కూడా ఆయనే పోటీ చెయ్యాలని అనుకున్నారు.. 2014 ఎన్నికల్లో ఇక్కడినుంచి వైసీపీ తరుపున లేళ్ల అప్పిరెడ్డి పోటీచేశారు. ఆయనే బలమైన అభ్యర్థి అని నియోజకవర్గంలో నానుడి ఉంది. అయితే కన్నా లక్ష్మి నారాయణ కోసం ఈసారి వైసీపీ బలహీన అభ్యర్థిని రంగంలోకి దింపిందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ కన్నాను నరసారావు పేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చెయ్యాలని సూచించింది. అయినా కూడా ఈ సీటును వదులుకోవడం ఇష్టం లేని కన్నా తన కుమారుడు నాగరాజును బరిలోకి దింపాలని విశ్వప్రయత్నాలు చేశారు.. కానీ అది అధిష్టానం చివరకు ఈ సీటును మాదవీలతకు కేటాయించడం విశేషం.
The post గుంటూరు వెస్ట్ టిక్కెట్ దక్కించుకున్న హీరోయిన్ మాధవీలత appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Hwr8VN
No comments:
Post a Comment