మారిపోయిన మన అలవాట్లే కిడ్నీలను పాడు చేస్తున్నాయి. కిడ్నీల వ్యాధులభారిన ఏటా పదుల లక్షల మంది పడుతున్నారు. కిడ్నీల్లో రాళ్లు చేరిన కారణంతోనే ట్రీట్మెంట్ కు వేలల్లో ఖర్చు చేస్తున్నారు. ఇక అవి పూర్తిగా మూలనపడ్డాయంటే రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే. పోయేలోపులో డయాలసిస్ కోసం లక్షల్లో దారపోయక తప్పని దుస్థితి. మన జీవన శైలిలో కొద్దిపాటి మార్పులతో కిడ్నీలను భద్రంగా ఉంచుకోవచ్చు. మనం జాగ్రత్త వహించాల్సిన అలవాట్లు ఇవే…
ఉప్పుతో ముప్పు:
శరీరంలో ఫ్లూయిడ్ల స్థాయి సంతులనపరచడం కిడ్నీల ముఖ్యమైన విధి. సున్నితమైన ఈ ప్రక్రియను సోడియం ప్రభావితం చేస్తుంది. ఎక్కువ సోడియం కలిగిన పదార్థాలను తీసుకున్నపుడు కిడ్నీ పనితీరు నెమ్మదిస్తుంది. ఫలితంగా శరీరంలో ఎక్కువ నీరు నిలుస్తుంది. సో ఎక్కువ ఉప్పు తింటే కిడ్నీలకు ముప్పేనన్నమాట.
తీపితో చేదు:
మిఠాయిల్లో ఉన్న తియ్యదనం అందరినీ నోరూరించి ప్రభావితం చేస్తుంది. కాని వాటిని జీర్ణం చేసే క్రమంలో మన శరీరంలోని పార్ట్స్ అష్టకష్టాలు పడతాయి. స్వీట్లలో ఉండే ఫ్రక్టోజ్ శరీరంలోకి చేరి కిడ్నీల పనితీరును మందగింపజేస్తుంది. కాబట్టి ఎప్పుడోతప్ప తీపి పదార్థాలు తినకపోవడమే మంచిది.
మితిమీరిన మాంసం:
మాంసం ఎక్కువగా తిన్నా కిడ్నీలకు డేంజర్ బెల్స్ మోగినట్టేనట. మాసంలో ఉండే మెగ్నీషియం కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తుంది. పదే పదే తినకూడదని నిపుణులు తాజా పరిశోధనల ద్వారా తేల్చారు.
అతిగా కాఫీ, టీలు:
నిత్యం లేచింది మొదలు నిద్రపోయే వరకు కాఫీ, టీలు సేవించే వారికి కిడ్నీల సమస్యలు త్వరగా వస్తాయి. కాఫీ, టీలల్లో ఉండే కెఫీన్ తో కిడ్నీలు ఒత్తిడికి గురవుతాయి. వాటిని ఫిల్టర్ చేయడానికీ విపరీతమైన భారం పడుతుంది. రోజుకు ఒకటి రెండు సార్లకు మించి తాగకపోవడమే మంచిది.
కూల్ డ్రింక్స్:
కార్బొనేటెడ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ లాంటివి కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇవి తాగినప్పుడు కిడ్నీలపై భారం అధికంగా పడుతుంది.
కాల్షియం ఉండే ఆకు కూరలు:
ఆకు కూరలు చాలా మంచివి. అసలు ఆకు కూరలనే తింటూ ఉండండి సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని చాలా మంది సలహా ఇస్తుంటారు. కాని ఆయా కూరల్లో కాల్షియం ఎక్కువగా ఉన్నవి తీసుకుంటే కిడ్నీలకు సమస్యేనట..
మూత్రం ఆపితే:
చాలా మంది మూత్రాన్ని ఆపుతూ ఉంటారు. పరిస్థితులు అనుకూలించకుంటే గంటలకొద్దీ మూత్రాన్ని అలాగే బిగపట్టేవారు చాలా మందే ఉన్నారు. ఇలా చేయడం వల్ల రాళ్లు చేరుతాయి. ఇంకా సమస్య తీవ్రత పెరిగితే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది.
బ్లడ్ ప్రెజర్:
బ్లడ్ ప్రెజర్ ప్రెజర్ పెరిగితే కిడ్నీ సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి రక్తప్రసరణను రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి. అదుపులో ఉంచుకోవాలి. బ్లడ్ షుగర్ ఉన్నవారూ చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా కిడ్నీలకు ముప్పు పొంచి ఉన్నట్టే.
ఎడాపెడా మందుల వాడకం:
ప్రతి చిన్న సమస్యకీ మనం మందులను వాడుతుంటాం. మందుల వాడకం దుష్ప్రభావం చూపించే ఆర్గాన్ ఏదైనా ఉందంటే అది మొదటిగా కిడ్నీనే. సో డాక్టర్లు చెప్పిన పద్ధతిలోనే మందులు వాడాలి. మోతాకు మించి వాడడం ఏమాత్రం మంచిదికాదు.
సిగరెట్లు, మద్యపానం:
కిడ్నీలకు ప్రధాన శత్రువులు ఇవి. మధుమేహం ఉండి ఈ అలవాట్లు కూడా ఉంటే ఇంకా ప్రమాదం. సో బీ కేర్ ఫుల్.. పది మందికి ఉపయోగపడే ఈ సమాచారాన్ని అందరూ తెలుసుకునేలా షేర్ చేయండి.
The post కిడ్నీలను దెబ్బతీసేఈ అలవాట్లు మీకున్నాయా….? తెలుసుకొని జాగర్త పదండి. appeared first on DIVYAMEDIA.
source http://www.divyamedia.in/kidney-stones-in-very-denjours/



No comments:
Post a Comment