etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, March 21, 2019

ఎన్నికల అఫిడవిట్‌లో తన చదువు గురించి పేర్కొన్న పవన్, ఏం చదివాడో తెలుసా …?

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పవన్‌ ప్రచారంలో దూకుడు పెంచారు. పవర్‌ ఫుల్‌ డైలాగ్‌లతో వైసీపీ, టీడీపీలను నిలదీస్తున్నారు. వైసీపీకి పగ్గాలిస్తే భూ కబ్జాలే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు, చెట్టూ పుట్టా కూడా దోచేస్తారని మండిపడ్డారు. వాటిని అంతమొందించడానికే జేడీని పార్టీలోకి తెచ్చామన్నారు. మరోవైపు ఇవాళ పవన్‌ భీమవరంలో నామినేషన్‌ వేయనున్నారు..రెండు చోట్ల పోటీ చేయడంలో సేమ్‌ టు సేమ్‌ అన్నయ్యను ఫాలో అయిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే గాజువాకలో తొలి నామినేషన్‌ వేశారు. ఇవాళ భీమరంలో రెండో నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 1.30కు ఆయన తన నామినేషన్‌ వేయనున్నారు. తరువాత భీమవరంలో జనసేన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. మూడు గంటలకు నిడమర్రులో, సాయంత్రం 4 గంటలకు ఏలూరులో బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారు.

గురువారం విశాఖ నగరపాలక సంస్థ జోన్ -5 కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు పవన్‌. తరువాత గాజువాకలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన జగన్‌పై నిప్పులు చెరిగారు. జగన్‌ జాతకమంతా ఈడీ, సీబీఐ చేతుల్లో ఉందని ఆరోపించారు. ఆయన దోపిడీ చేస్తారా.. ప్రజలకు న్యాయం చేస్తారా.. అంటూ మండిపడ్డారు పవన్. తనకు రాజకీయం తెలియదంటారా.. రాజకీయం అంటే ఏంటో చూపిస్తానని హెచ్చరించారు. అక్రమాలు , భూ కబ్జాలు అంతం చేస్తామని అన్నారు. ఏ ముఖం పెట్టుకుని వైసీపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆస్తులు ప్రకటించారు. గాజువాక అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తాను పదోతరగతి పాస్ అయినట్లు పవన్ పేర్కొన్నారు

The post ఎన్నికల అఫిడవిట్‌లో తన చదువు గురించి పేర్కొన్న పవన్, ఏం చదివాడో తెలుసా …? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2HBgpsP

No comments:

Post a Comment