etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, March 21, 2019

ఈ వ్యక్తి ప్రతీరోజు పరగడుపున వెల్లుల్లి తిన్నాడు, తర్వాత ఏం జరిగిందో తెలుసా …..?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు. వెల్లుల్లి (Garlic) మొక్క శాస్త్రీయ నామం ‘ఏలియం సెతీవం’ (Allium sativum). ఉల్లి వర్గానికి చెందినది. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. భారతదేశంలో అనాది నుండీ నేటివరకు ఆదరణలో ఉన్న సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువల్ని గుర్తించి వాడుతున్నారు. హోమియోపతీలో ఏలియం సిపా, ఏలియం సెతీవం అనే మందులు ఉన్నాయి.

అనేక రుగ్మతలకి దివ్యౌషధంగా వెల్లుల్లి

బరువు ను తగ్గించడంలో

రోజుకు 2 వెల్లుల్లి రెబ్బలు తింటే చాలా లాభం. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాము. అంతేకాదు జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్‌ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల ఆకలి వేయదు. తినాలనే కోరిక కూడా బాగా తగ్గుతుంది. అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేసే గుణం

శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాసు రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది: మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని పొద్దున్నే తాగితే మంచిది. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. అంతేకాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధిచేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. ప్రమాదకరమైన విషపదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.

యాంటీ బాక్టీరియల్‌గా

వెల్లుల్లి రసం బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లను బాగా తగ్గిస్తుంది. అంతేకాదు వైరల్‌, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను అరికడుతుంది. రోజూ వెల్లుల్లి తినడం వల్ల జలుబు,దగ్గు వంటి అనారోగ్యాలు దరిచేరవు. వెల్లుల్లిలోని యాంటిబాక్టీరియల్‌ పదార్థాలు గొంతు ఇన్ఫెక్షన్లను, శ్వాససంబంధమైన ఇన్ఫెక్షన్లను పోగొడతాయి. ముఖ్యంగా బ్రోంకైటిస్‌ నివారణకు వెల్లుల్లి మందులా పనిచేస్తుంది.

లివర్‌ జబ్బును ట్రీట్‌చేసే విధంగా

వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్‌, సెలినియం రసాయనాలు ఫ్యాటీ లివర్‌ జబ్బును ట్రీట్‌చేసే బైల్‌ అనే ఫ్లూయిడ్‌(కాలేయం ఈ ఫ్లూయిడ్‌ను ఉత్పత్తిచేస్తుంది. ఇది జీర్ణక్రియ సరిగా జరిగేట్టు సహాయపడుతుంది)ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. వెల్లుల్లిలో యాంటాక్సిడెంట్లు కూడా బాగా ఉన్నాయి. వీటిల్లో అమినోయాసిడ్స్‌, ప్రొటీన్లు కూడా ఉన్నాయని అధ్యయనాల్లో వెల్లడయింది. ఇవి కాలేయాన్ని ప్రకృతిసిద్ధమైన విష పదార్థాల నుంచి రక్షిస్తాయి.

నొప్పి ని తగ్గించడలో…

వెల్లుల్లిలో యాంటి ఆర్ధైటిక్‌ ప్రొపర్టీస్‌ బాగా ఉన్నాయి. ఇవి శరీరంలోని నొప్పిని తగ్గిస్తాయి. వీటిల్లోని యాంటీ-బాక్టీరియల్‌, ఎనాలజిస్టిక్‌ గుణాల వల్ల పంటి నొప్పి లాంటివి తగ్గుతాయి.

గుండెను కాపాడటంలో…

రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత బబ్బులు రావు. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడంలాంటివి (బ్లడ్‌ క్లాట్స్‌) సంభవించవు. పచ్చి వెల్లుల్లిని తినలేకపోతే ఆహారపదార్థాలలోనైనా వేసుకొని తప్పనిసరిగా వెల్లుల్లి తినడం మంచిది.

బ్లడ్‌ షుగర్‌ని తగ్గించడంలో…

వెల్లుల్లి గ్లూకోజ్‌ టాలరెన్స్‌ను మెరుగుపరుస్తుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని గుజ్జులా చేసి గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లతో నోట్లో వేసుకుని మింగేయాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్‌ షుగర్‌ తగ్గుతుంది.

కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో…

వెల్లుల్లి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెసా్ట్రల్‌ పది నుంచి ఆరు శాతం వరకూ తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉన్న రసాయనాలకు ఆర్టీరియల్‌ ప్లేక్‌ ఫార్మేషన్‌ కాకుండా ఆపగల సామర్థ్యం కూడా ఉంది. రోజూ వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యకరమైన లైంగిక జీవనాన్ని కొనసాగించగలుగుతారు.

ఇంత విలువైన ఔషధ గుణాలున్న వెల్లుల్లి మనం నిత్యం వాడుతున్నప్పటికీ, దీని విలువ తెలుసుకుని మరింత వినియోగించు కుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.

The post ఈ వ్యక్తి ప్రతీరోజు పరగడుపున వెల్లుల్లి తిన్నాడు, తర్వాత ఏం జరిగిందో తెలుసా …..? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2TRN8AT

No comments:

Post a Comment