కూరలో కొత్తి మీర వేస్తున్నాం కదా ఇంక ధనియాలు ఎందుకు అని అనుకోకండి. ధనియాలతో పాటు మరికొన్ని మసాలా దినుసులు కలిపిచేసిన పొడిని వంటల్లో వేస్తే మరింత రుచి వస్తుంది. కొత్తిమీర నుంచి వచ్చిన ధనియాలు వంటల్లో ఎంత ప్రాధాన్యత వహిస్తుందో.. ఔషధంగా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. శరీరాన్ని చల్లబరిచే శక్తి ధనియాలకు ఉంది. ఇటీవల జరిపిన అధ్యయనాల్లో ధనియాలు కార్మినేటివ్‌గా అంటే గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించేదిగా పనిచేస్తుందని తేలింది. మూత్ర సంబధ సమస్యలతో బాధపడే వారికి ధనియాలు మంచి మందు. లైంగిక శక్తిని ప్రేరేపిస్తుంది. అంతర్గత అవయవాల్లో నొప్పిని నివారిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ని తగ్గిస్తుంది. ధనియాల్లో అనేక పోషకాలు ఉన్నాయి. న్యూట్రీషియన్ చార్ట్ ప్రకారం ఇందులో ఫైబర్ 8శాతం ఉంటే, కాల్షియం 2.9 శాతం ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యూరప్‌లో దీన్ని యాంటీ బయాటిక్ ప్లాంట్‌గా పిలుస్తారు.
ముఖ్యంగా థైరాయిడ్‌తో బాధపడుతున్నవారు ధనియాలను తీసుకుంటే చాలా వరకు ఉపశమనం ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతున్నా ఇది కూడా ప్రయత్నించి చూడండి. ధనియాలను 5,6 స్పూన్లు తీసుకుని గ్లాస్ నీటిలో వేసి రాత్రి పూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తాగాలి. ఇలా నెలరోజులు పాటు చేస్తుంటే థైరాయిడ్ సమస్య మిమ్మల్ని బాధించదు. దీంతో పాటు మెడకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ కొన్ని యోగాసనాలను చేస్తుంటే థైరాయిడ్ సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. మెత్తగా చేసిన ధనియాల పౌడర్‌లో చిటికెడు పసుపు కలిపి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కొలెస్టరాల్‌తో బాధపడేవారు రెండు చెంచాల ధనియాలను తీసుకుని ఒక గ్లాసు నీటిలో కలిపి మరిగించి చల్లార్చి తాగాలి. ఇలా రెండు పూటలా చేస్తుంటే నెల రోజుల్లో ఫలితం కనబడుతుంది. పీరియడ్స్ నొప్పితో బాధపడే మహిళలకు ధనియాలు చక్కని ఔషధం. అధిక రుతుస్రావాన్నీ అరికడుతుంది. ఆరు స్పూన్ల ధనియాలు తీసుకుని అర లీటర్ నీటిలో కలిపి పావు లీటర్ అయ్యేవరకు మరిగించాలి. ఆ తరువాత దించి దానికి కొద్దిగా పటిక బెల్లం కలిపి గోరువెచ్చగా తాగుతుంటే నొప్పి, రక్తస్రావ్య తీవ్రత తగ్గుతుంది. పీరియడ్స్ కూడా రెగ్యులర్‌గా వస్తుంటాయి.
The post ధనియాలు గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన ఆరోగ్య నిపుణులు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2U1V41A


No comments:
Post a Comment