దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో పులివెందులలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె సునీత ఉన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వివేకానందరెడ్డి సౌమ్యుడిగా పేరు పొందారు. తనకు సహాయం చేయమని అడిగిన వారి కోసం ఎంతవరకైనా వెళ్లేవారు. రాజకీయాల్లో వైఎస్సార్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తూ అజాత శత్రువుగా ఉన్నారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ఏంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పనిచేశారు. వైఎస్ వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు. వైఎస్సార్‌కు వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. 1989,1994లలో పులివెందుల నుంచి వైఎస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004 లలో కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. వ్యయసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. చాల సౌమ్యునిగా పేరున్న వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం కడప జిల్లాతో పాటు, వైఎస్సార్ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది.
The post వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం, వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2T6yMr1
No comments:
Post a Comment