ఇటీవల కాలంలో మహిళలు ఎదుర్కోంటున్న అనారోగ్య సమస్యలలో ముఖ్యమైనది యూరినరీ బర్నింగ్. మహిళలు ముఖ్యంగా వివిధ యంత్ర పరికరాలపై పనిచేసే స్త్రీలు, రసాయనాల ఫ్యాక్టరీలలో పనిచేసేవారు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. మూత్ర విసర్ణనకి వీలుకాని సందర్భం తోడైనప్పుడు, ఇతరేతర కారణాల వల్ల ఇన్‌ఫెక్షన్ సోకినపుడు మూత్రంలో మంటసమస్యతో బాధపడుతున్నారు. వారికి ఆయుర్వేదంలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. కిడ్నీలు(వృక్కములు) మూత్ర నాళములు, మూత్రాశయం, మూత్రద్వారంలో ఎక్కడైనా ఇన్‌ఫెక్షన్ కలిగినపుడు మూత్రంలో ఆమ్లీకరణ స్థితి ఎక్కువైనప్పుడు మూత్రంలో మంట, పొత్తి కడుపులో నొప్పి, దుర్వాసన మొదలైన లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. అయితే అందరిలోనూ ఈ లక్షణాలు ఒకే విధంగా ఉండకపోవచ్చు. సాధారణంగా చిన్నపిల్లల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్ల వల్ల కడుపులో నొప్పి, జ్వరం, వాంతులు, జననాంగాలలో దురద ఉంటుంది.
ఇదే విధంగా 20సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు వారిలో కిడ్నిలో రాళ్లు, గర్భం ధరించినపుడు మూత్రద్వారంలో ఒరిపిడి, ఎస్.టి.డిలు మందులకు సైడ్ ఎఫెక్ట్‌గా, యోని ద్వారం వద్ద వాపు మొదలైన కారణాల వల్ల మూత్రంలో మంట సమస్యతో బాధపడతారు. మహిళల్లో బాక్టీరియా, ఫంగస్ చాలా తేలికగా మూత్రాశయానికి చేరి మూత్ర సంబంధమైన ఇబ్బందులను కలిగిస్తాయి. మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట, మూత్రంలో రక్తం రావడం, దుర్వాసన, చలితో కూడిన జ్వరం, పొత్తి కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. యాభై సంవత్సరాలు పై బడిన మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. మూత్రాశయంలో కంతులు, మూత్రనాళంలో కాథెటర్ వేసిన తర్వాత, శస్త్రచికిత్స మొదలైన కారణాలతో సమస్య వస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులను ఈ వ్యాధి ఎక్కువగా బాధిస్తుంది.
ఆయుర్వేద సంహిత గ్రంథాలలో మూత్రకృచ్ఛ వ్యాధి(యూరినరీ బర్నింగ్) ఎనిమిది రకాలుగా పేర్కొన్నారు.
మూత్రంలో మంట రావడానికి కారణాలు..
* అతిగా తీక్షణమైన ఆహారం అనగా కారం, పులుపు, మసాలాలు తీసుకోవడం.
* నీళ్ళు తక్కువగా తీసుకోవడం
* మాంసాహరం అధికంగా సేవించడం మూలంగా వాతపిత్తదోషాలు ప్రకృపితమై మూత్రకృచ్ఛ వ్యాధి వస్తుందని పేర్కొన్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* మూత్రంలో మంట, వేడి ఉన్నప్పుడు వెంటనే ఆచరించాల్సిన ఉపశమన చర్య ఎక్కువగా మంచి
నీళ్ళు తాగడం.
* మంట , నొప్పి ఎక్కువగా ఉంటే పండ్లరసాలు, బార్లీనీళ్లు, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, రాగిజావ, మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను విరివిగా తీసుకుంటే మూత్రంలో ఆమ్లీకరణ శాతం తగ్గుతుంది.
* అధికంగా కారం, మసాలాలు కలిగిన ఆహారం తినటం తగ్గించాలి.
* మూత్రాన్ని ఆపుకోకుండా వీలు ఉన్న సమయంలో పరిశుభ్రమైన ప్రదేశంలో మూత్ర విసర్జన చేయాలి.
* మూత్ర విసర్జన తర్వాత మూత్ర ద్వారాన్ని శుభ్రపరుచుకుంటే చాలావరకు ఈ సమస్యను నివారించవచ్చు.
* పిత్త ప్రకృతి వ్యక్తులలో ఎప్పుడు దాహం, అరిచేతులు అరికాళ్ళు వేడిగా ఉండటం, ఎక్కువగా చెమట పట్టడం, కళ్లమంటలు, తరచుగా వేడి చేసిందనే భావన ఉంటుంది. వీరిలో మూత్రంతో మంట సమస్య అధికంగా ఉంటుంది. వీరు శీతాకాలంలో కూడా ఈ సమస్యతో బాధ పడతారు. ఎక్కువగా నీళ్ళు తాగడం, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, మసాలాలు తగ్గించడం వంటి మార్పులతో జీవనశైలి మార్చుకోవాలి.
* ఒక్కోసారి మూత్రం మంటతో కూడి ఎరుపు రంగులో వస్తే.. కిడ్నీిలలో రాళ్ళు ఉండే ప్రమాదం ఉంది. వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి.
చికిత్స..
* మూత్రంలో మంటÛ వ్యాధి నివారణలో చందనం, ఉసిరి, గోక్షుర, పునర్నవ, శిలాజిత్తు, హపుష, ఆమలకీ, తులసీ మొదలగు ఔషధాలు మంచి ఫలితాలను ఇస్తాయి. చంద్రప్రభావటి, చందనాసవం, ఉశీరాసవం, గోక్షురాది గుగ్గులు మొదలగు ఔషధాలు వైద్యుల సలహా మేరకు వాడాలి.
* ప్రముఖ కంపెనీలు తయారు చేసిన నీరి మాత్రలు, ఉశీరాల్కా, రీనాల్కా మొదలైన ఔషధాలు ఈ వ్యాధిలో ఉపయోగపడతాయి. చాలాకాలంగా ఈ వ్యాధితో బాధపడేవారు కర్పురశిలాజిత్తును పటికబెల్లం (కలకండ)తో కలిపి మండలం(40) రోజులు సేవిస్తే పూర్తి నివారణ అవుతుంది.
The post మూత్రంలో మంట వంట్లో వేడి వెంటనే తగ్గాలి అంటే, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2XZp6lS
No comments:
Post a Comment