ఎసిడీటీ.. కడుపుమంట.. చికెన్, మటన్ లాంటి మసాలా ఫుడ్స్, కూల్ డ్రింక్స్, పిజ్జా లాంటి బెకరీ ఫుడ్స్ తిన్నప్పుడు కడుపు ఉబ్బరం అనిపిస్తుంటుంది. దీన్నే వైద్య పరిభాషలో ఎసిడీటీ అంటారు. ఈ మధ్యకాలంలో ఎసిడిటితో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎసిటిడితో బాధపడేవారికి తక్షణం తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయంటున్నారు కొంతమంది డాక్టర్లు. వీటిని తూచా తప్పకుండా వాడితే తప్పకుండా ఉపశమనం లభిస్తుందంటున్నారు. ప్రతిరోజు 5 నుంచి ఆరు తులసీ ఆకులను నమలడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అరటిపండులో పొటాషియం, హైబర్ ఉంటాయి కాబట్టి అరటిని తింటే కడుపులోని యాసిస్‌ను తొందరగా నివారించి తొందరగా ఉపశమనం పొందేలా చేస్తుంది. ఎసిడిటి ఉన్న వారు నిత్యం ఒక అరటిపండు తింటే ఎసిడిటి పడకుండా ఉంటారు.
ఎసిడిటి ఉన్నవారికి తక్షణ ఉపశమనం కొబ్బరినీళ్ళు. ప్రతిరోజు రెండుగ్లాసుల కొబ్బరినీళ్ళు తాగేవారికి ఎసిడిటి దరిచేరదట. కొబ్బరి నీళ్ళు కడుపులో ఉన్న మిగిలిన యాసిస్ ను పోగొడుతుంది కాబట్టి కొబ్బరి నీళ్ళు ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇవన్నీ మనకు సులువుగా దొరుకుతుంది కాబట్టి వీటిని వాడడం చాలా ఈజీ.
పాలల్లో కాల్షియం మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల చల్లటి పాలు తీసుకోవడంతో కడుపులో ఉన్న యాసిస్ ను తొందరగా గ్రహించి ఎసిడిటి రాకుండా కాపాడుతుంది. బాగా ఎసిడిటితో బాధపడేవారు ఒక పావు కప్పు చల్లటి పాలను తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చట. తులసి ఆకులు అల్సస్ కారకానికి మంచి మందు. ఎసిడిటితో బాధపడేవారు ఐదు నుంచి ఆరు తులసీ ఆకులను బాగా నమిలి ఆ రసం మింగితే ఎసిడిటి నుంచి విముక్తి పొందవచ్చు.
The post అసిడిటి పోవాలంటే ఇంట్లోనే ఇలా చేస్తే చాలు. అసిడిటి మటుమాయం…! appeared first on DIVYAMEDIA.
source http://www.divyamedia.in/acidity-simple-solution-home/


No comments:
Post a Comment