etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, April 20, 2019

ఒక స్మార్ట్‌ఫోన్‌ రీఫండ్‌ అడిగితే..10 ఫోన్లు, గూగుల్‌ పిక్సెల్‌​ 3 కొన్ని చీటోకి వింత అనుభవం.

గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన ఒక వినియోగదారుడికి అరుదైన అనుభవం ఎదురైంది. రెడిట్‌ ప్రచురించిన కథనం ప్రకారం చీటో అనే వినియోగదారుడు గూగుల్‌ పిక్సెల్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే అది సరిగ్గా పనిచేయకపోవడంతో, దాని డబ్బులు వాపసు ఇవ్వాలని కోరుతూ ( రూ.56,898) గూగుల్‌ కంపెనీని కోరాడు. అయితే దీనికి బదులుగా కేవలం రూ.5500 మాత్రమే రీఫండ్‌ చేసింది.

ఇక్కడ ఇంకోట్విస్ట్‌ ఏంటంటే చీటో కి జాక్‌ పాట్‌ లాంటి ఆఫర్‌ వచ్చింది. నగదు రీఫండ్‌కు బదులుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 పిక్సెల్‌ 3 స్మార్ట్‌ఫోన్ల పార్సిల్‌ పలకరించింది. దాదాపు 6లక్షల రూపాయల విలువ చేసే పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లు చూసి చీటో ఖంగుతిన్నాడు. అయితే తన సొమ్ము మొత్తం రీఫండ్‌​ వచ్చే వరకు… ఈ స్మార్ట్‌ఫోన్లను కంపెనీకి వెనక్కి ఇచ్చేది లేదని ప్రకటించాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం గూగుల్‌ మొత్తం సొమ్మును చీటోకి రీఫండ్‌ చేసిందట.దీంతో చీటో మొత్తం 10 ఫోన్లను కంపెనీకి రీసెండ్‌ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కొసమెరుపు ఏంటంటే చీటో మరో పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్‌ చేయడంతో పదిఫోన్లు ఆర్డర్‌ చేసినట్టుగా భావించిందట కంపెనీ. అయితే పొరపాటుగా పంపించిన 10 ఫోన్లను రీఫండ్‌ చేయమని కంపెనీ అడిగే పరిస్థితిలో లేనప్పటికీ.. నిజాయితీగా తనకు పార్సిల్‌ను తిరిగి వెనక్కి ఇచ్చేదుకు సిద్దపడ్డాడు చీటో.

The post ఒక స్మార్ట్‌ఫోన్‌ రీఫండ్‌ అడిగితే..10 ఫోన్లు, గూగుల్‌ పిక్సెల్‌​ 3 కొన్ని చీటోకి వింత అనుభవం. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2UN2t6i

No comments:

Post a Comment