టీవీ షోలో అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలకు రూ. 20 లక్షల చొప్పున బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ జరిమానా విధించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది పారా మిలటరీ అమర జవానుల కుటుంబాలకు ఇద్దరూ లక్ష రూపాయల చొప్పున చెల్లించాలని ఆదేశించారు. అంధుల క్రికెట్ అసోసియేషన్‌కు చెరో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని సూచించారు. నాలుగు వారాల్లోగా వీరిద్దరూ ఈ మొత్తాన్ని చెల్లించాలన్నారు.
ఒకవేళ జరిమానా చెల్లించకుంటే వీరికి ఇచ్చే మ్యాచ్ ఫీజులోంచి బీసీసీఐ తీసుకోవాలని అంబుడ్స్‌మన్ ఆదేశించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా పర్యటన నుంచి వెనక్కు వచ్చేయడంతో ఇప్పటికే రూ. 30 లక్షల చొప్పున ఆదాయం కోల్పోయారని తెలిపారు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్లు రోల్ మోడల్స్‌గా ఉండాలని, వారి ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండాలన్నారు. తాము చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే హార్దిక్, రాహుల్ క్షమాపణలు చెప్పారు.
The post బీసీసీఐ షాక్, రాహుల్, హార్దిక్ పాండ్యాలకు భారీ జరిమానా, appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2GqhGjx
No comments:
Post a Comment