దొంగతనం చేసినా దొరలా చేయాలంటారు. ఏది చేసినా.. భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్తే ఏదైనా సాధించొచ్చంటారు. ధైర్యం ఉంటే తమ్మిని బమ్మి.. బమ్మిని తమ్మి చేయొచ్చు. కాకపోతే మన దగ్గర పిసరంత తెలివి ఉండాలి. అదే మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఓ వ్యక్తి రెస్టారెంట్‌కు వెళ్లి ఫుల్లుగా మెక్కాడు. తర్వాత బిల్లు ఎగ్గొట్టాలనుకున్నాడు. దాని కోసం భలే స్కెచ్ వేశాడు. ముందే ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్న చచ్చిపోయిన ఎలుకను తను ఫుడ్ తిన్న ప్లేట్‌లో వేసి.. రచ్చ రచ్చ చేశాడు. కానీ.. మనోడి అత్యాశ వల్ల అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్నది. చైనాలో హైదిలావో అనే రెస్టారెంట్ చాలా ఫేమస్. దానికి చైనాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి.
ఆ రెస్టారెంట్‌కు తన భార్యతో సహా వెళ్లిన గువో ఫుడ్ తిన్న అనంతరం చచ్చిపోయిన ఎలుకలో ప్లేట్‌లో వేసి యాజమన్యాన్ని నిలదీశాడు. ఆహారంలో ఎలుక వచ్చిందంటూ రచ్చ చేశాడు. దీంతో రెస్టారెంట్ సిబ్బంది తను తిన్న ఫుడ్‌కు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పింది. అయినప్పటికీ అతడు రెస్టారెంట్ సిబ్బంది మాట వినలేదు. మనసులో ఆశ మొలకెత్తింది. దీంతో వాళ్లు 20 వేల యువాన్లు ఇస్తామన్నారు. అంటే మన కరెన్సీలో 2 లక్షల రూపాయలు అన్నమాట. అయినప్పటికీ మనోడు తగ్గలేదు. 5 మిలియన్ యువాన్స్ కావాలన్నాడు. అంటే 5 కోట్ల రూపాయలు అన్నమాట. దీంతో రెస్టారెంట్ వాళ్లు చేతులెత్తేశారు. అంత డబ్బు కట్టడం తమవల్ల కాదని చెప్పారు. అయినప్పటికీ.. ఆ వ్యక్తి భీష్మించుకు కూర్చోవడంతో తప్పక పోలీసులకు సమాచారం అందించారు.
రెస్టారెంట్‌కు చేరుకున్న పోలీసులు.. రెస్టారెంట్ తప్పేమీ లేదని.. కావాలనే ఆ వ్యక్తి చనిపోయిన ఎలుకను అందులో వేశాడని తెలుసుకొని అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన గత సంవత్సరం నవంబర్‌లో చోటు చేసుకున్నది. ఆ కేసుకు సంబంధించి తాజాగా కోర్టులో విచారణ జరుగగా.. ఆ వ్యక్తి తానే చనిపోయిన ఎలుకను తీసి ప్లేట్‌లో వేసినట్లు ఒప్పుకున్నాడు. తను ఇంటికి వెళ్తుంటే చనిపోయిన ఎలుక కనిపించిందని.. దాన్ని ఓ బాటిల్‌లో వేసి ఇంటికి తీసుకెళ్లానని.. రెస్టారెంట్‌లో ఫ్రీగా ఫుడ్ తినడం కోసం బాటిల్‌లోని ఎలుకను రెస్టారెంట్‌కు తీసుకొచ్చి ప్లేట్‌లో వేశానని ఒప్పుకున్నాడు.
The post చనిపోయిన ఎలుకను ఫుడ్‌లో వేసి 5 కోట్లు డిమాండ్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు..! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2OJQVu4


No comments:
Post a Comment