etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, April 12, 2019

డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. 8904 క్లరికల్ గ్రేడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారే మెయిన్ పరీక్షలకు అర్హత పొందుతారు. జూన్ మొదటి వారంలో ప్రిలిమినరీ పరీక్ష, ఆగస్టు రెండో వారంలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

పోస్టుల వివరాలు..

జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్): 8904 పోస్టులు
తెలంగాణలో 425
ఏపీలో 253
అర్హత: ఏదైనా డిగ్రీ
వయసు: 01.04.2019 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.04.1991 – 01.04.1999 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వుంటుంది.
పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750.. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.25 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.04.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.05.2019
దరఖాస్తుల ఎడిట్‌కు చివరి తేదీ: 03.05.2019
దరఖాస్తులు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 18.05.2019
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ: 12.04.2019 – 03.05.2019
ప్రిలిమినరీ పరీక్ష: జూన్‌లో
మెయిన్ పరీక్ష: 10.08.2019

The post డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. 8904 క్లరికల్ గ్రేడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2Gh9Ytg

No comments:

Post a Comment