మిజోరాంకి చెందిన ఓ నాలుగేళ్ల పిల్లాడు స్కూల్ నుంచి వచ్చిన తరువాత వాకిట్లో సైకిల్ తొక్కుంటానంటే అమ్మ కాదనలేకపోయింది. జాగ్రత్తలు చెబుతూ సైకిల్ ఇచ్చింది. వాడు హ్యాపీగా సైకిల్ తొక్కుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో పక్కింటి వాళ్ల కోడిపిల్ల ఒకటి అడ్డొచ్చింది. బ్రేకులు వేసినా కోడి పిల్ల సైకిల్ చక్రాల కింద అప్పటికే పడిపోయింది. పాపం అది అక్కడి నుంచి కదల్లేకపోయింది. దాంతో బుజ్జిగాడికి దాన్ని అలా చూసేసరికి ఏడుపు వచ్చేసింది.
దాన్ని జాగ్రత్తగా పట్టుకుని అమ్మ దగ్గరకి వచ్చాడు. అమ్మా ఎలాగైనా దీన్ని కాపాడాలి. హాస్పిటల్‌కి తీసుకెళదాం పద. నేనే కదా తప్పు చేసింది. నా పాకెట్ మనీతోనే దానికి ట్రీట్‌మెంట్ చేయిస్తాను అని అనేసరికి తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. కొడుకుని, కోడిపిల్లను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లింది. వైద్యులు కోడిపిల్లను పరీక్షించి పెద్దగా దెబ్బలేమీ తగల్లేదు. ఏం భయం లేదు. రేపటి కల్లా అది నడుస్తుందిలే అని వారి దగ్గరే ఒక రోజు కోడిపిల్లను ఉంచమన్నారు.
కోడిపిల్లకు వైద్యం చేయడానికి.. నా పాకెట్ మనీ తీసుకోండి అని పిల్లవాడు అనేసరికి డాక్టర్లు ముచ్చట పడ్డారు. పెద్ద వాళ్లు కూడా ఇలా ఆలోచిస్తే ఎంత బావుంటుంది అని అనుకున్నారు. ఈ విషయాన్ని ‘సంగా సేస్’ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. దీంతో నెటిజన్స్‌కి బుజ్జిగాడు తెగ ముద్దొచ్చేశాడు. వాడిలాగా మనం కూడా ఆలోచించాలని 62 వేల మందికి షేర్ చేశారు.
The post నా సైకిల్ కింద కోడిపిల్ల పడింది.. నా తప్పేమీ లేదు.. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2WQafbU


No comments:
Post a Comment