పామును చూస్తేనే ఆమడ దూరం పారిపోతాం.. కానీ అపాయంలో చిక్కున్న పామును ధైర్యంగా రక్షించింది ఓ జంతు ప్రేమికురాలు. బీర్ టిన్‌లో ఇరుక్కొని బయటకు రాలేక అవస్థలు పడుతున్న పామును కర్ర సహాయంతో రక్షించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్లోరిడాకు చెందిన రోసా ఫాండ్ అనే మహిళ .. టిన్‌లో చిక్కకుని విలవిల్లాడుతున్న పామును బయటకు తీసి నెటిజన్స్ ప్రశంసలు అందుకుంది. గురువారం సాయంత్రం రోసా బ్రూక్స్‌విల్లే మార్గంలో కారులో వెళ్తున్నారు. ఇంతలో రోడ్డు ప్రక్కన పాము కనిపించింది దాని చుట్టూ శునకాలు చేరి ఉన్నాయి.వెంటనే అక్కడి చేరుకొని ఆమె కర్ర సహాయంతో దానికి విముక్తి కలిగించింది.
దీనికి సంబంధించిన వీడియోను రోసా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. “పామును కాపాడడానికి నాకు ఇంత దైర్యం ఎక్కడినుంచి వచ్చిందో అర్ధం కావడం లేదు. నా చేతులతో రెండు సార్లు పామును పట్టుకున్నాను”. ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రోసా మీకెంత ధైర్యం అది విషం లేని బ్లాక్ రేసరే అయినప్పటికీ మీ కేరింగ్ అద్భుతం. అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
The post బీర్ టిన్‌లో చిక్కుకున్న పాము..దాన్ని చూసిన శునకాలు..అసలు ఏం జరిగిందో చుడండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2I8NXiD
No comments:
Post a Comment