సింహం సింగిల్‌గా వస్తుందంటారు.. కానీ సీన్ రివర్సైంది. ఇక్కడ సింహాలు గుంపులు గుంపులుగా వచ్చాయి. అదీ రైల్వే ట్రాక్‌పైకి! విహారానికి వచ్చాయో.. మరెందుకు వచ్చాయో కానీ 20 నిమిషాల పాటు రైల్వేట్రాక్‌పైనే ఉండి రైలు రాకపోకలకు అంతరాయం కలిగించాయి. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో విరావల్ – ధరి రైల్వే మీటర్ గేజ్ దగ్గర ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కాగా ఈ తతంగాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీయగా అది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘రైలు ఇంజిన్ డ్రైవర్ సింహాల రాకను గుర్తించి రైలు వేగాన్ని తగ్గించాడు. వాటికి ఏ హాని తలపెట్టకుండా హారన్ కొడుతూనే రైలును కొద్ది కొద్దిగా మూవ్ చేశాడు. దాంతో సింహాలు ఇబ్బంది పడ్డాయేమో.. వచ్చిన దారిలోనే అక్కడినుంచి నిష్క్రమించాయి’ అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
The post ట్రాక్‌పైకి గుంపులు గుంపులుగా సింహాలు..! దీంతో …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Up3vFd
No comments:
Post a Comment