etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, April 4, 2019

ఏసీబీ బాధ్యతల నుంచి ఠాకూర్‌ తొలగింపు, దానికి అసలు కారణం ఇదే.

ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఏసీబీ డీజీ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. కొత్త ఏసీబీ డీజీగా బాగ్చికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా జీవో జారీ చేశారు. డీజీపీ కావడానికి ముందు ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్‌ పని చేశారు. డీజీపీగా పదవి చేపట్టిన తర్వాత కూడా ఆర్‌పీ ఠాకూర్‌ ఏసీబీని తన ఆధ్వర్యంలోనే ఉంచుకున్నారు. చంద్రబాబు ఆదేశాలంతో ఏసీబీ డీజీగా కొనసాగుతూ చరిత్రలో ఎన్నడూ లేని సంప్రదాయానికి తెరతీశారు.

ఇటీవల టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడంతో డీజీపీ ఠాకూర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం హుటాహుటిన ఆర్పీ ఠాకూర్‌ను ఢిల్లీకి పిలిపించింది. అదే సమయంలో ఏసీబీ బాధత్యల నుంచి తప్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా ఆదేశాలు జారీ చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది.ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాతో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ భేటీ అయ్యారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ జీవో వివాదంపై ఈసీ వివరణ కోరినట్లుగా తెలిసింది. రేపు మరోసారి ఎన్నికల సంఘం ముందు డీజీపీ హాజరు కానున్నారు.

The post ఏసీబీ బాధ్యతల నుంచి ఠాకూర్‌ తొలగింపు, దానికి అసలు కారణం ఇదే. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2FZJL24

No comments:

Post a Comment