ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు.ఒక వ్యక్తికి సహాయం చేసినప్పుడు దొరికే ఆనందం …. దుఖం ద్వారా ఏర్పడే మానసిక బలం కంటే చాలా గొప్పది . ఒకరికి సహాయం చేశామనే మానసిక సంతృప్తి నిర్వచించలేనిది, చిరస్మరణీయమైనది . ఉత్తరప్రదేశ్‌లో ఓ కానిస్టేబుల్ వృద్ద మహిళకు చేసిన సహాయం అందరీ ప్రశంసలు అందుకుంది. లేడి కానిస్టేబుల్ మాన్వీ తన పని కోసం అవస్థలు పడుతూ బ్యాంక్ వద్ద వేచి ఉన్న వృద్ద మహిళను చూసింది. అధికారులతో మాట్లాడి సహాయం అందించడంతో పాటు నీరసంగా ఉన్న ఆమెకు ఆహారాన్ని అందజేసి శభాష్ అనిపించుకుంది మాన్వీ. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అలాగే యూపీ పోలీసు డైరక్టర్ జనరల్ ఒ.పి సింగ్ మాన్వీని ప్రశంసించారు. తన విధులతో పాటు మానవ దృక్పథంతో తను చేసిన పని ప్రశంసనీయమైనది అన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
DGP OP Singh commended Const.Manvi,in an appreciation letter, for exemplifying highest human virtues of kindness along with her duty
She not only empathetically comforted an hassled old lady outside a bank,helped her with her work but also offered her food
Congratulations Manvi! pic.twitter.com/HCYC8Eufb6— UP POLICE (@Uppolice) April 1, 2019
The post ఆ కానిస్టేబుల్ చేసిన సహాయానికి అభినందనాల వర్షం, సోషల్ మీడియాలో వైరల్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2VmtycH
No comments:
Post a Comment