etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, April 6, 2019

జనసేన తరపున నాగబాబు సతీమణి, హైపర్ ఆది రోడ్‌షో

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం వంటి పలు సంక్షేమ అంశాలతో జనసేన మ్యానిఫెస్టో రూపొందించారని జనసేన పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి గుణ్ణం నాగబాబు అన్నా రు. శుక్రవారం నాగబాబు యలమంచిలి మండలంలోని ఏను గువానిలంక, బాడవ గ్రామాలలోనూ పాలకొల్లు మండలంలో ని గోరింతాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు ఏనుగువానిలంక, బాడవ గ్రామా ల్లో రోడ్‌ షో నిర్వహించి అక్కడి ప్రజలకు జనసేన మ్యాని ఫెస్టోలోని అంశాలను వివరించి, తనను పూర్తి మెజార్టీతో గెలి పించాలని కోరారు. అనంతరం పాలకొల్లు మండలంలోని గో రింతాడలో ప్రచారం నిర్వహించేందుకు వెళ్లగా అక్కడ వృద్ధు రాలు హారతులిచ్చి ఆశీర్వదించారు. జనసేన మ్యానిఫెస్టో ద్వా రా బీసీలకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇస్తున్నారని, అదేవిధంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మ్యానిఫెస్టో రూపకల్పన చేశారని వివరించా రు. జనసేన అధికారంలోకి వచ్చేందుకు గాజుగ్లాసుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా నాగబాబు కోరారు.

మా ఓట్లు మీకే..

పట్టణంలోని 18, 20వ వార్డుల్లో నాగబాబు సతీమణి రాజ రాజేశ్వరి తన భర్త తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కనిపించిన రోజుల పసిపాపను ఎత్తుకుని ముద్దాడారు. అనంతరం 20వ వార్డులో వృద్ధురాలిని ఓటు అడిగేందుకు వెళ్లగా ఓ వృద్ధురాలు ‘నా బంగారు తల్లీ.. ఎండన బడి ఓటు అడగటానికి వచ్చావా… మా ఓట్లు మీకే వేస్తాం’ అంటూ రాజరాజేశ్వరి చేతిని ఆప్యాయంగా ముద్దా డింది. అనంతరం యలమంచిలి మండలంలో నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి సతీమణి పద్మజ, జబర్దస్త్‌ నటుడు హైపర్‌ ఆదిలతో కలిసి రోడ్‌షో ద్వారా ఎన్నికల ప్రచారం ని ర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మండెల మురళీ, వి.బాలేష్‌, ఎం.కేశవ నాగసాయి, చంటి, బాలు, బి.బాలాజీ, వి.మురళీకృష్ణ, ఇమ్మానుయేల్‌, ఎం.వెంకటేశ్వరరావు, విజయభాస్కరరావు, ఐసుబ్రహ్మణ్యం, ఎం.ధనరాజ్‌, ఎం.అశోక్‌, సురేష్‌, ఆర్‌ మహే ష్‌, షేక్‌ ఛాంద్‌బీబీ, మజ్జి పెద్దింట్లు, బెజ్జవరపు నాగరాజు, శివాల పూర్ణారావు, వి.సీతారామయ్య అథిక సంఖ్యలో జన సేనానులు పాల్గొన్నారు.

The post జనసేన తరపున నాగబాబు సతీమణి, హైపర్ ఆది రోడ్‌షో appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2CZxZ64

No comments:

Post a Comment