etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, April 6, 2019

అది చూశాక నాకు భయం పట్టుకుంది.. అలా కొట్టేశానంతే: రస్సెల్

ఓడిపోతున్న మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించిన కోల్‌కతా ఆటగాడు ఆండ్రూ రస్సెల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమి కోరల్లోంచి అనూహ్యంగా బయటపడి విజయాన్ని అందుకుంది. ప్రతిసారీ కోల్‌కతా జట్టుకు ఆపద్బాంధవుడు అవుతున్న రస్సెల్ ఈసారి కూడా జట్టును ఆదుకున్నాడు. చివర్లో 13 బంతుల్లో ఏకంగా 48 పరుగులు చేసి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.

తాజాగా, రస్సెల్ మాట్లాడుతూ.. తాను క్రీజులోకి వచ్చినప్పుడు పిచ్‌ను బట్టి ఆడాలని కెప్టెన్ దినేశ్ కార్తీక్ తనకు సలహా ఇచ్చినట్టు చెప్పాడు. అయితే, ఎదురుగా కనిపిస్తున్న స్కోరు బోర్డును చూసినప్పుడు మాత్రం గుండె ఆగినంత పనైందన్నాడు. 20 బంతుల్లో 68 పరుగులు చేయాలని తెలిసినప్పుడు మరెప్పుడూ ఇలాంటి రోజు తనకు ఎదురుకాకూడదని అనుకున్నానన్నాడు. అయితే, ఆ తర్వాత ఏకాగ్రత పెంచుకుని కొట్టేశానని, నిజానికి ఎలా కొట్టానో కూడా తనకు తెలియదన్నాడు. జట్టులోని ఆటగాళ్లందరూ తనను ప్రోత్సహిస్తారని పేర్కొన్న రస్సెల్.. నచ్చిన విధంగా ఆడే స్వేచ్ఛను దినేశ్ ఇచ్చాడని వివరించాడు. సహచరుల ప్రోత్సాహం వల్లే తానీవిధంగా ఆడగలుగుతున్నానని రస్సెల్ పేర్కొన్నాడు.

The post అది చూశాక నాకు భయం పట్టుకుంది.. అలా కొట్టేశానంతే: రస్సెల్ appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2FUBhrP

No comments:

Post a Comment