etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, April 24, 2019

దగ్గు వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటించి క్షణాల్లో దగ్గును దూరం చేసుకోండి. తెలుసుకోండి.

అసలే చలికాలం. వైరస్‌లన్నీ ఎప్పుడు అటాక్ చేయాలా అంటూ కాచుక్కూర్చుంటాయి. అందుకే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, చలి జ్వరం లాంటివి ఒకదాని మీద మరోటి వచ్చి చేరుతుంటాయి. అటు దగ్గు తగ్గక.. ఇటు జలుబు తగ్గక నరకం అనుభవిస్తుంటారు కొంతమంది. ఎన్ని మందులు వాడినా కొంతమందికి దగ్గు అస్సలు తగ్గదు. అటువంటి వాళ్లు ఈ యాంటి బయాటిక్స్, టానికులు లాంటివి ఆపేసి.. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించారంటే క్షణాల్లో దగ్గును పోగొట్టొచ్చు. దగ్గు మిమ్మల్ని వేధిస్తుంటే.. కాస్త తేనె, పసుపును మిశ్రమంగా తయారు చేసుకొండి. ఆ మిశ్రమాన్ని తాగేయండి. పసుపులో ఉండే కార్టూమన్స్, యాంటీ బ్యాక్టీరియా, యాంటి వైరల్ గుణాలు దగ్గు తగ్గేందుకు దోహదపడతాయి. అయినప్పటికీ దగ్గు విపరీతంగా వస్తే.. అల్లాన్ని ఎండబెట్టి.. దాన్ని పౌడర్‌గా చేసుకోండి. ఆ పౌడర్, తేనె మిశ్రమాన్ని దగ్గు ఉన్నన్ని రోజులు క్రమం తప్పకుండా తీసుకోండి. దీంతో మీకు పొడి దగ్గు తగ్గిపోతుంది.

కొంతమందికి దగ్గు అలాగే వస్తూనే ఉంటుంది. నోట్లో నుంచి నంజు కూడా వస్తుంది. అటువంటి వాళ్లు.. నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిలించి ఊంచండి. దీంతో గొంతులో ఉండే నంజంతా బయటికి వచ్చేస్తుంది. దీంతో మీ దగ్గు తగ్గుతుంది. అల్లం టీ తాగినా దగ్గు తగ్గుతుంది. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి నీటిలో వేసి ఆ నీటిని బాగా మరిగించండి. మరిగిన నీటిని వడబోసి రోజుకు రెండుమూడు సార్లు తాగండి. పాలు తాగే అలవాటు ఉన్నవాళ్లయితే.. గోరు వెచ్చిన పాలలో కొంచెం మిరియాల పొడి వేసుకొని తాగితే దగ్గు నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది

The post దగ్గు వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటించి క్షణాల్లో దగ్గును దూరం చేసుకోండి. తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2IDureb

No comments:

Post a Comment