కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం అక్నూ యూనివర్సిటీ ఎంఎస్‌ఎన్ క్యాంపస్‌లో బుధవారం ఏక్సిస్ బ్యాంకులో బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు క్యాంపస్ ప్రత్యేక అధికారి ఆచార్య టి. అశోక్ ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ విద్యార్హతగా పేర్కొన్నా, ఎంబీఏ మార్కెటింగ్ కోర్సు చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకు రావాలని కోరారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల కేటాయింపు ఉంటుందన్నారు. ఇతర సమాచారం కోసం 99087 95983, 80743 01705 నంబర్లలలో సంప్రదించాలని కోరారు.
The post యాక్సిస్ బ్యాంక్‌లో జాబ్స్.. పరీక్షా లేదు, ఇంటర్వ్యూ ఆధారంగా కేటాయింపులు…! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Xy3KLo
No comments:
Post a Comment