వాట్సాప్‌లో ఒకరి నుంచి ఇంకొకరికి ఫార్వార్డ్ అయ్యే సందేశాల కారణంగా దేశంలో కొన్నాళ్ల క్రితం పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ఇప్పుడు ఒక పెను ప్రమాదంగా పరిణమించాయి. మరి ఈ ఎన్నికల వేడిలో మరిన్ని నకిలీ వార్తలు ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఏది నిజం… ఏది అబద్ధం? అనే సందేహం కచ్చితంగా వచ్చి తీరుతుంది. దాన్ని నివృత్తి చేయడానికి వార్తల్లో వాస్తవాన్ని ‘ప్రొటో’ అనే సంస్థతో కలిసి టిప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఏదైనా అనుమానాస్పద ఫోటో లేదా వీడియో గనక మీ వాట్సాప్‌లోకి చేరితే 91-9643-000-888 నెంబర్‌కు పంపిస్తే చాలు. ఆ సమాచారం ‘నిజమా, మోసమా’ అనే విషయాన్ని ధృవీకరిస్తూ కూడా సమాధానం పంపుతుంది. ఇంగ్లిషుతో పాటు హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళీ భాషల సమాచారాన్ని ఈ హెల్ప్‌లైన్ సమీక్షిస్తుంది.
The post వాట్సాప్‌లో వచ్చే సమాచారం నిజమైనదో …! లేక ఫేక్ న్యూస్…! అని తెలుసుకోవాలంటే.. ఈ నంబర్ చెప్పేస్తుంది! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2HUDHdp
No comments:
Post a Comment