వేసవి వచ్చిందంటే చెరుకు రసం బళ్లు ప్రత్యక్షమవుతాయి. వేసవిలో ఎక్కువగా దొరికే అద్భుతమైన పానీయం చెరుకు రసం. దీంట్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అవును చెరుకు రసంలో అనేక ఆరోగ్య సమస్యలను నివారించే గుణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే చెరుకు రసం గురించి తెలుసుకుందాం….
1. చెరుకు రసం శరీరంలో నీటి స్దాయిని పెంచి ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
2. దంత క్షయంతో బాధపడుతున్నవారు ప్రతిరోజు చెరుకురసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.
3. చెరుకురసం శరీరంలో ఉన్న ప్రొటీన్స్ ను సమతూల్యం చేస్తుంది. అనేక మూత్ర సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
4. చెరుకు రసంలో అల్లం, నిమ్మరసం కూడా కలుపుతారు. దీని వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు జీర్ణ సమస్యలు కూడ దరి చేరవు.
5. ప్రతిరోజు చెరుకురసం తాగడం వల్ల క్రమేపీ బరువు తగ్గుతారు.
6. ఇందులో ఉన్న యాంటీ ఆక్సీడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్స్ ను అదుపు చేసి…. శరీరంలో ఉన్న కణాల స్దాయి పడిపోకుండా కాపాడతాయి.
7. స్వీట్లు ఎక్కువగా తినే వారికి దంత సమస్యలు ఎక్కువగా ఉండి నోటి దర్వాసనతో బాధపడతారు. అలాంటప్పుడు ప్రతిరోజూ చెరుకురసం తాగితే ఆ సమస్య నుంచి బయటపడతారు.
8. పచ్చకామెర్ల వ్యాధికి చెరుకురసం అద్భుతమైన ఔషధం అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
9. షుగర్ వ్యాధి వారికి తరచు నీరసంగాను, ఆకలిగాను ఉంటుంది. అలాంటప్పుడు ఒక గ్లాసు చెరుకురసం తాగాలి. షుగర్ వ్యాధిగ్రస్తులు చెరుకు రసం తాగితే షుగర్ పెరుగుతుందన్నది ఆపోహ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు.
10. చెరుకు రసంలో షుగర్ లేదని, దానిలో సుక్రోజ్ అనే పదార్దం ఉందని, ఇది శరీరంలో ఉన్న గ్లూకోజ్ ను అదపు చేసి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుందంటున్నారు. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్న వారు చెరుకు రసాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు.
11. జలుబు, తుమ్ములతో బాధపడుతున్నవారు ఒక్క గ్లాసు చెరుకురసంతో ఉపశమనం పొందుతారు.
ఎసిడిటీ, మలబద్దకం ఉన్న వారికి చెరుకు రసమే ఔషధం.
12. చెరుకు రసంలో ఉన్న ఐరన్ కంటెంట్ శరీరానికి ఎనీమియా రాకుండా నివారిస్తుంది.
13. ఇందులోని క్యాల్షియం ఎముకలు, కండరాలకు శక్తినిస్తుంది.
14. సాధారణంగా 40 ఏళ్లు దాటిన స్త్రీలకు శరీరంలో క్యాల్షియం స్దాయిలు తగ్గుతాయి. అలాంటప్పుడు చెరుకురసం తాగితే క్యాల్షియం స్దాయి పెరుగుతుంది.
15. డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలలో ఏర్పడే రాళ్ళను కరిగించడానికి చెరుకురసం ఎంతో సహాయపడుతుంది.
16. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ప్రత్యకమైన ఆహారం.. ప్రత్యేకమైన వ్యాయామం చేస్తారు. వారి శరీరంలో ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. అలాంటప్పుడు వారిని విపరీతమైన ఆకలి, నీరసం వెంటాడతాయి. అలాంటప్పుడు చెరుకురసం రోజుకు మూడు లేక నాలుగు గ్లాసులు తాగితే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
17. తరచు నోటి పూతతో (mouth ulcers) తో బాధపడేవారు చెరుకురసంతో దానికి చెక్ పెట్టవచ్చు.
The post ఎండాకాలంలో చెరుకు రసం తాగుతున్నారా ..అయితే ఇదే మీకోసమే ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Zx5fuW
No comments:
Post a Comment