ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం మరీ ఎక్కువైంది. ఉదయం లేచినప్పటి నుండి పడుకునేంతవరకు ఫోన్ అవసరం ఉన్న లేకున్నా వాడుతూనే ఉంటాము. ఫోన్లు దగ్గరగా ఉండటం వల్ల రేడియేషన్ వస్తుందని , అందుకే దూరం పెట్టాలని డాక్టర్లు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉంటే ప్రమాదకరమని హెచ్చరిస్తుంటారు. “కళ్ళు పోయి కబోదులవుతారన్న” వినకుండా ఫోన్ ఎక్కువగా వాడే వాళ్లకు ఇది ఒక సాక్ష్యం అని, ఒక 25 ఏళ్ళ చెన్ కథను వివవరించారు. ఈమె ఇలాగే ఫుల్ బ్రైట్‌నెస్‌తో మొబైల్ వాడి.. కంటి సమస్యలు కొని తెచ్చుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఈమె ఒకరోజు తీవ్ర కళ్లనొప్పితో డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. ఆమె కళ్ళను చెక్ చేసిన డాక్టర్ కంగుతిన్నాడట. ఆమె రెండు కళ్ల కార్నియాలు దెబ్బతిన్నాయని గుర్తించాడు. బ్రైట్ నెస్ అతిగా ఉండటం వల్ల ఆమె కార్నియాలు కాలిపోయాయని.. దాని వల్ల కార్నియాలో రంధ్రాలు ఏర్పడ్డాయిన తెలిపారు. ఆమె కుడికన్ను, ఎడమ కన్ను కార్నియాలలో 500 రంధ్రాలు ఏర్పడ్డాయి. దీనికి అంతటికీ కారణం.. వరుసగా రెండేళ్లు.. ప్రతిరోజూ ఫుల్ బ్రైట్ నెస్‌తో స్మార్ట్ ఫోన్‌ను వినియోగించడమేనని వైద్యుల పరీక్షలో తేలింది.
డాక్టర్లు చెప్పిన కథనం ప్రకారం.. బ్రైట్ నెస్ 300 ల్యూమెన్స్ ఎక్కువ ఉండకూడదని పేర్కొన్నారు. 600 ల్యూమెన్స్ కంటే ఎక్కువగా ఉంటే రెటీనా, కార్నియా పూర్తి దెబ్బతింటాయి. అయితే చెన్ ఉపయోగించిన ఫోన్ కంపెనీ ఏంటో వివరాలు తెలియదంట. ఏది ఏమైనా బ్లూ లైట్ ఉన్న ఫోన్లను ఎక్కువగా వాడొద్దని డాక్టర్లు, హెచ్చరిస్తున్నారు. ఫోన్ ప్రియులు ఇక మీద ఫోన్ వాడే టప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి..
The post మీరు మీ ఫోన్ ఇలా చూస్తున్నారా …? అయితే మీ కళ్ళు తొందరలోనే …..! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2HZGZw4


No comments:
Post a Comment