ప్రపంచ సంపన్నుడు జెఫ్ బీజోస్.. తన భార్య మెకంజీకి విడాకులు ఇవ్వనున్నాడు. అమెజాన్ సీఈవో బీజోస్ తన భార్యకు భరణంగా 3500 కోట్ల డాలర్లు సమర్పించనున్నాడు. అమెజాన్ సంస్థలోని నాలుగు శాతం షేర్లను భార్య మెకంజీకి ఇవ్వనున్నట్లు బీజోస్ తెలిపారు. జూలై చివరి లోగా ఈ మొత్తాన్ని అందించనున్నారు. ప్రస్తుతం బీజోస్, మెకంజీ జంట విడాకులు తీసుకునే ప్రక్రియలో ఉన్నారు. డైవర్స్ తీసుకుంటే వచ్చే సొమ్ముతో ఇప్పుడు మెకంజీ ప్రపంచంలోనే మూడవ సంపన్న మహిళగా మారనున్నారు. మెకంజీ కన్నా ముందు టాప్ లిస్టులో లోరియల్ సంస్థ ఓనర్ ఫ్రాంకోయిజ్ మేయర్స్, వాల్‌మార్ట్ ఓనర్ అలిస్ వాట్సన్‌లు ఉన్నారు.
జెఫ్ బీజోస్ తన భార్యకు భారీ భరణం సమర్పించుకున్నా.. తన ఆస్తులకు మాత్రం కొడవ రావడం లేదు. విడాకుల కింద 3500 కోట్ల డాలర్లు ఇచ్చినా.. జెఫ్ బీజోస్ ప్రపంచ ప్రథమ సంపన్నుడిగానే ఉంటారు. విడాకుల తర్వాత కూడా ఆయన ఆస్తి 110 బిలియన్ డాలర్లు. ప్రపంచ సంపన్నుల్లో బిల్ గేట్స్ రెండవ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తులు 99 బిలయన్ల డాలర్లుగా ఉంది. బీజోస్ రిలీజ్ చేసిన డైవర్స్ స్టేట్‌మెంట్ ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానం సంతరించుకున్నది.గతంలో ఆర్ట్ డీలర్ అలెక్ వైల్డ్‌స్టీన్ తన భార్య జోసిన్ విడాకుల కోసం 400 కోట్ల డాలర్లు ఇచ్చుకున్నాడు.
The post విడాకుల కోసం భార్యకు 3500 కోట్ల డాలర్లు ఇచ్చేశాడు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2FXn6lM
No comments:
Post a Comment