etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, April 2, 2019

పొద్దున్నే పెరుగన్నం తింటే..ఏమవుతుందో తెలుసా …?

ఇప్పుడంటే ఇడ్లీలు, దోశలు, వడలు అంటూ టిఫిన్లు వచ్చాయి కానీ మా కాలంలో అయితే పిల్లలు కూడా పొద్దున్నే లేచి రాత్రి వండిన అన్నంలో పెరుగు వేసుకుని తిని బడికి వెళ్లేవాళ్లు.. ఏంటో ఈ నాజూకు తిళ్లు తిని ఊపిరి లేకుండా ఉంటున్నారు.. నాలుగు అడుగులు నడవలేరు.. చిన్న పని చేయలేరు.. చాలా మంది ఇళ్లల్లోని పెద్దవాళ్లు ఇప్పటి పిల్లలను చూసి ఇలాగే మాట్లాడుతుంటారు. పరిశోధనలు కూడా పాత పద్దతులే మంచి వని వెల్లడిస్తున్నాయి.. పెరుగు వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే బ్యాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు ధృడంగా మారుతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలు దరిచేరవు.

పెరుగన్నం తినడం వల్ల మెదడులో ట్రిప్టోఫాన్ అంటే అమైనో ఆసిడ్ విడుదలవుతుంది. ఈ ఆసిడ్ వల్ల మెదడులోని నరాలన్నీ చల్లబడి మెదడు కూల్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని అన్ని కణాలకు ప్రశాంతమైన సందేశాలను పంపుతుంది. అందుకే పెరుగన్నం మెదడుకి మేత అంటారు. దీంతో మానసిక ప్రశాంతత కూడా కలుగుతుందని అంటున్నారు వైద్యులు. ట్రిప్టోఫాన్ అనే పదం సంస్కృతంలో ‘తృప్తి’ అనే పదం నుంచి వచ్చిందట. అందుకే భోజనం పెరుగన్నంతో పూర్తి చెయ్యాలి అంటారు పెద్దలు. ఉదయం లేదా మధ్యాహ్నం పూట మాత్రమే పెరుగన్నం తినడం మంచిది. శీతాకాలం, వర్షాకాలంలో బయట వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి రాత్రి పూట పెరుగన్నం తినకపోవడమే మంచిది.

రాత్రిపూట తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుంటుంది. తరచు దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేవారైతే రాత్రిపూట పెరుగన్నం తినకపోవడమే మంచిది. అయితే ఈ సమస్యలు ఉన్నవారు కూడా పెరుగులో కొద్దిగా మిరియాలపొడి కలుపుకొని తినడం వల్ల కఫ సమస్యలు దరిచేరవు. జీర్ణక్రియ కూడా సులభంగా జరుగుతుంది.

The post పొద్దున్నే పెరుగన్నం తింటే..ఏమవుతుందో తెలుసా …? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2FL4vcB

No comments:

Post a Comment