etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, April 14, 2019

ఇద్దరు కాదు.. ముగ్గురు, చెర్రీ, ఎన్టీఆర్‌లకు ప్రభాస్ తోడు కానున్నారా..?

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డివీవీ దానయ్య సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ నటిస్తుండగా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ అలరించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబందించి ఓ ఇట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిత్రంలో చెర్రీ, ఎన్టీఆర్ లతో పాటు ప్రభాస్ కూడా కనిపించనున్నారనేది ఆ వార్త సారాంశం.

ప్రభాస్ వాయిస్ ఓవర్‌తోనే చిత్రంలోని అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రలను పరిచయం చేయనున్నారని, అలాగే చిత్రంలో ఓ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారని అంటున్నారు. ఈ విషయమై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. దాదాపుగా ఇదే ఫైనల్ అయిపోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇక చెర్రీ, ఎన్టీఆర్, ప్రభాస్ విజువల్ ట్రీట్‌తో థియేటర్లు హోరెత్తడం ఖాయమే!

The post ఇద్దరు కాదు.. ముగ్గురు, చెర్రీ, ఎన్టీఆర్‌లకు ప్రభాస్ తోడు కానున్నారా..? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2P8fwsW

No comments:

Post a Comment