etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, April 14, 2019

పేదలకు సేవచేయాలనే ఆలోచనతోనే…హైదరాబాద్‌లో ప్లేట్ బిర్యానీ రూ. 10

పది రూపాయలకు ఈ రోజుల్లో ఏంవస్తుందని అడిగితే టక్కున చె ప్పలేని పరిస్థితి. కనీసం కప్పు టీ తాగాలన్న రూ. 12 కావాల్సిందే. ఒక్కసారి రెస్టారెంట్‌కు వెళ్లితే సర్వ్‌ చేసిన సప్లైయర్‌కు రూ. 10 టిప్పుగా ఇవ్వాలిందే. అలాంటిది అదే పదిరూపాయల్లో కడుపునిండా రుచికరమైన బిర్యానీ పెడితే ఎలా ఉంటుంది. వినడానికే ఆశ్చార్యంగా ఉంది కదూ…! మీరు ఈ బిర్యానీ తినాలనుకుంటే నగరంలో బర్తన్‌బజార్‌కు వెళ్లాల్సిందే. అక్కడే కాదండోయ్‌ నగరంలో నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అక్సా బిర్యానీ సెంటర్లలోను లభిస్తోంది.నలుగురు స్నేహితులు కలిసి పేదలకు అతి తక్కువ ధరకు బిర్యానీ అందించాలనే ఆలోచనలో నుంచి పుట్టినవే ఈ అక్సా బిర్యానీ సెంటర్లు. ఉస్మానియా ఆస్పత్రికి రోగులతో పాటు వచ్చే అటెండెంట్లు, పేదలకు రూ.10వెజ్‌ బిర్యానీ తినిపించాలనే సేవా భావంతో నగరంలోని అఫ్జల్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు ఇఫ్తెకార్‌, ముకీం, ఇజాజ్‌, సాబేర్‌ గత 9 సంవత్సరాల క్రితం ఉస్మానియా ఆస్పత్రికి ఎదురుగా అక్సా బిర్యానీ సెంటర్‌ ఏర్పాటు చేశారు.

రూ. 10కే బిర్యానీ ఇస్తుండడంతో ఆస్పత్రికి వచ్చే వారితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలైన బర్తన్‌బజార్‌, సిద్ధిఅంబర్‌బజార్‌, బేగంబజార్‌లతో పాటు మార్కెట్‌కు వచ్చే వారు అక్సా బిర్యానీ రుచి చూడకుండా వెళ్లలేరు. మొదట్లో మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే అందుబాటులో ఉండేది. డిమాండ్‌ పెరగడంతో ఉదయం 7గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రజల నుంచి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని లాభాలను పంచుకోకుండా నగరంలో మరో నాలుగు (అఫ్జల్‌గంజ్‌ బస్‌స్టాప్‌, కోఠితోపాటు ఆబిడ్స్‌లో రెండు) బిర్యానీ సెంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం ఐదు సెంటర్ల ద్వారా పేదలకు రూ.10లకే బిర్యానీని అందిస్తున్నారు. అఫ్జల్‌గంజ్‌లో బిర్యానీని ఎప్పటి కప్పుడు తయారు చేయించి వాహనాల ద్వారా సెంటర్లకు తరలిస్తుండడంతో వేడి వేడి బిర్యానీని ఆరగించేందుకు అంతా ఇష్టపడుతున్నారు.

పేదల కోసం ఏర్పాటు చేశాం

9 సంవత్సరాల క్రితం ఉస్మానియాకు వచ్చే పేదల కోసం బిర్యానీ అక్సా బిర్యానీ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. నాటినుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. మొత్తం 15 మంది వరకు పనిచేస్తుంటారు. ఏ ఒక్కరూ లాభం కోసం పనిచేయరు. కేవలం పేదల కడుపు నింపేందుకే రూ. 10కే ప్లేట్‌ వెజ్‌ బిర్యానీ అందిస్తున్నాం. మొత్తం ఐదు సెంటర్లను ఏర్పాటు చేసి వేడి వేడి బిర్యానీ అందిస్తున్నాం. క్షణాల్లోనే బిర్యానీ అయిపోతుంది. అందుకే బిర్యానీ తీసుకువచ్చేందుకు ఆటో సిద్ధంగా ఉంటుంది. పేదలకు సేవ చేసేందుకు నలుగురు మిత్రుల కలిసి అక్సా బిర్యానీ సెంటర్లను ఏర్పాటు చేశారు.
– అసద్‌ (మలక్‌పేట్‌)

ఆశీర్వదించి వెళుతుంటారు..

ఐదేళ్లుగా బిర్యానీ సెంటర్‌లో పనిచేస్తున్నాను. రూ. 10కే ప్లేట్‌ బిర్యానీ వస్తుండడంతో కడుపునిండా బిర్యానీ తిని చాలా బాగుంది. మీరు చల్లాగా ఉండాలని ఆశీర్వదించి వెళుతుంటారు. నిత్యం వందల సంఖ్యలో బిర్యానీ కోసం పేదలు వస్తుంటారు.వారికి బిర్యానీ సెంటర్లో మంచినీళ్లు, కూర్చోవడానికి కుర్చీలను ఏర్పాటు చేసి సేవచేస్తున్నాం. ఇక్కడ పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది.
– ముజాహిద్‌

The post పేదలకు సేవచేయాలనే ఆలోచనతోనే…హైదరాబాద్‌లో ప్లేట్ బిర్యానీ రూ. 10 appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2v6pX6Q

No comments:

Post a Comment