ఈ ఏడాది మేలో ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగే టీం ఇండియా ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఇందుకోసం కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ) ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే గత కొంతకాలంగా అటు టీం ఇండియాలో, ఐపీఎల్‌లో రాణిస్తున్న యువ ఆటగాడు రిషబ్ పంత్ ఆశలపై బీసీసీఐ నీళ్లు జల్లింది. రిజర్వ్ కీపర్‌గా రిషబ్‌ను జట్టులోకి తీసుకుంటారని అభిమానులు భావించారు. కానీ పంత్‌ని కాకుండా.. దినేశ్ కార్తీక్‌ని రిజర్వ్ కీపర్‌గా తీసుకున్నారు.
దీంతో పంత్‌కు ప్రపంచకప్ అవకాశం చేజారింది. అయితే పంత్‌ని జట్టులోకి ఎందుకు తీసుకోలేదో మీడియా సమావేశంలో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. ‘‘ఒకవేళ ధోనీ గాయపడితే.. పంత్ కానీ, కార్తీక్‌ని కానీ జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుందని అంతా అనుకున్నాం. కానీ అది ఎంతో ముఖ్యమైన మ్యాచ్ అయితే.. వికెట్ కీపింగ్ చాలా ముఖ్యం. అందుకే పంత్‌కి బదులు దినేశ్ కార్తీక్‌ని జట్టులోకి తీసుకున్నాం. లేకుంటే పంత్‌కే అవకాశం ఇచ్చే వాళ్లం’’ అని ప్రసాద్ తెలిపారు.
అయితే ధోనీ గాయపడితే.. లేక అతను ఆడలేని పరిస్థితిలో ఉంటే మాత్రమే దినేశ్ కార్తీక్‌కి జట్టులో చోటు దక్కుతుందని ప్రసాద్ స్పష్టం చేశారు. ‘‘ధోనీ ఆడలేని పరిస్థితిలో ఉంటేనే కార్తీక్‌ని జట్టులోకి తీసుకుంటాం. ఎందుకంటే.. అతను ఒత్తిడిని తట్టుకొని అద్భుతంగా ఆడగలడు’’ అని ఆయన పేర్కొన్నారు
The post రిషబ్‌ను ఎందుకు తీసుకోలేదు.. స్పష్టం చేసిన చీఫ్ సెలక్టర్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Gijuee


No comments:
Post a Comment