మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరని అడిగితే.. సాయి పల్లవి పేరును ఇట్టే చెప్పేస్తారు సినీ ప్రేక్షకులు. తాను తెరపై కనిపించాలంటే ఏదైనా ప్రత్యేకత ఉండాలి అని.. అటువంటి పాత్రలనే ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది సాయి పల్లవి. తాజాగా ఆమె తీసుకున్న ఓ నిర్ణయం అందర్నీ షాక్‌కు గురి చేసింది. తమ కంపెనీ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమంటూ రెండు కోట్ల డీల్‌తో సాయి పల్లవిని సంప్రదించారట. తమ కంపెనీకి చెందిన ఫేస్ క్రీమ్ యాడ్‌లో నటించాల్సిందిగా ఆమెను కోరారని సమాచారం. అయితే తాను మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తాను సినిమాల్లోనే మేకప్ వేసుకోనని, అలాంటిది జనాలకు ఫేస్ క్రీమ్ వాడమని ఎలా చెబుతానంటూ.. రెండు కోట్ల డీల్‌ను వదులుకున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
The post రెండు కోట్ల ఆఫర్.. అయినా సరే వద్దనుకుంది! ఎందుకో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2DdHleu
No comments:
Post a Comment