పోలవరంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏం సంబంధం.. వాళ్ల రాష్ట్రంలోని భద్రాచలం మునిగిపోతుందని పోలవరం కట్టకూడదంటున్నారు.. అవసరమైతే భద్రాచలాన్ని కూడా మేమే తీసుకుంటాం అని చంద్రబాబు మరోసారి తన నైజాన్ని బయటపెట్టారు. ఇప్పటికే పోలవరం ముంపు అంటూ ఏడు మండలాలను ఏపీలో కలుపుకున్న చంద్రబాబు.. భద్రాచలాన్ని కూడా తీసుకుంటామంటూ తెలంగాణపై విషం కక్కారు. గురువారం ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోలవరాన్ని అడ్డుకొనేందుకు తెలంగాణ సీఎం ప్రయత్నిస్తున్నారని.. అవసరమైతే భద్రాచలాన్ని తీసుకుంటాం ఏం చేస్తారో చూస్తానంటూ దురుసుగా మాట్లాడారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను నియంత్రణలో ఉంచుకోవాలని తెలంగాణ చూస్తున్నదని, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి రెగ్యులేటర్లు మూసివేయాలని పట్టుబడుతున్నారని చెప్పుకొచ్చారు. ఎవరు అడ్డుకున్నా నదుల అనుసంధానం చేస్తానని, పట్టిసీమతో కృష్ణా, గోదావరిలను కలిపానని, శ్రీశైలంలో నీళ్లు నిల్వ ఉంచి రాయలసీమకు అందించానని చెప్పారు.
The post భద్రాచలం కూడా తీసుకుంటాం.. ఏం చేస్తారు : చంద్రబాబు appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2OQsRpJ
No comments:
Post a Comment