ఓటమికి వెరవద్దు. ఫెయిలర్‌తోనే జీవితం అయిపోదు. ప్రతి ఫెయిలర్ జీవితానికి వెలుగుబాట. పరీక్ష ఫలితాలతో జీవితం ఆధారపడదు. ప్రతి ఫెయిల్యూర్ ముందుకు వెళ్లడానికి దిక్చూచి. అంతేకానీ నేను ఫెయిల్ అయ్యాను, ఈ జీవితం ఇంతే.. అని మదనపడొద్దు. ఇంటర్, పదో తరగతిలో మార్కులు తక్కువగా వచ్చినా.. ఫెయిలైనా.. కుంగిపోవద్దు. వచ్చిన ఫలితంతో మన భవిష్యత్తును ఎలా మలుచుకోవాలో, మన గమ్యాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో అనే విషయంపై దృష్టి పెట్టాలని మానసిక, వైద్య నిపుణులు వివరిస్తున్నారు. పరీక్ష ఫలితాలు వచ్చాయంటే చాలు అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలవుతుంది. ఫలితాల ఆందోళన చివరకు విద్యార్థుల్లో ఆత్మనూన్యత భావానికి గురి చేసి, ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి. పరీక్షా ఫలితాలకు కేవలం విద్యార్థులు ఒక్కరే కారణం కాదని, అనేక కారణాలు ఉంటాయని అర్థం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవద్దని, ఆత్మపరిశీలన చేసుకోవాలని వైద్య నిఫుణులు, మానసిక నిపుణులు విద్యార్థులకు సూచిస్తున్నారు.
డిప్రెషన్ నుంచి….
ఈ ఆత్మహత్యలు మొదట డిప్రెషన్ నుంచి ఆరంభమవుతాయి. చెప్పుకోవడానికి ఎవరూ లేరని, పరిష్కారం లేదని భావించి విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఇంటర్, హైస్కూల్, ప్రాథమిక పిల్లల్లో కూడా ఆత్మహత్య భావన కలుతుందంటున్నారు. విద్యార్థులు పరీక్షలో ఫెయిల్ కావడంతో తోటి పిల్లల ముందు అవమానించడం ఆత్మహత్యకు దారి తీస్తుందన్నారు. దీంతో వారిపై వారికి నమ్మకం కలగపోవడం, ప్రతికూల భావం లేకపోవడం, మిగతా వారిలాగా టార్గెట్‌కు చేరుకోవడం వంటి విషయాల్లో ఆవేదన చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వైద్యులు వివరిస్తున్నారు.
అంచనాలు తప్పి
అంచనాలకు మించి ఆలోచనలు ఉండడం, ఒత్తిడి పెరగడం, అనుకున్నది సాధించలేకపోవడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు మానసికతత్వం, శరీరతత్వం కూడా అందుకు తోడ్పడుతుంది. ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి కారణాలు ఎక్కువగా ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఇటువంటి వారిని తొలిదశలోనే గుర్తించాలి. అవసరమైతే వైద్యులు, సైకాలజిస్టుల వద్దకు తీసుకుపోవాలి. ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా వారిని బాగు చేయవచ్చు.
వారిపై దృష్టి సారించాలి
ఒంటరిగా.. ఏదో పొగట్టుకున్న వారి పట్ల జర జాగ్రత్తగా వ్యవహరించాలి. వారిని అక్కున చేర్చుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు వారి బాధను గమనించి మేం నీకు ఉన్నామనే నమ్మకాన్ని కల్గించాలి. వారి ఆవేదన తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. వారికి మార్గదర్శకం చేయాలి. ఆనందం కల్గించే విధంగా వ్యవహరించాలి. మానసిక దైర్యం కల్పించాలి. అవసరమైతే ఇతర ప్రాంతాలకు వారిని తీసుకుపోవాలి. సైకాలజిస్టులు, వైద్యుల వద్దకు తీసుకుపోవాలి.
ఫలితాలను బట్టి జీవితాన్ని తీర్చుదిద్దుకోండి
1. రిజల్ట్స్ గురించి మర్చిపోండి-హాయిగా ఉండండి-టెన్షన్ పడొద్దు.
2. జీవితంలో ముందుకు సాగాలంటే ఇలాంటి ఫలితాలను ఛాలెంజ్‌గా తీసుకోవాలి.
3. ఫలితాలు, మార్కులు చూసి కుంగిపోవద్దు. మార్గాలు అనేకం ఉన్నాయి.
4. ఫలితాలను చూసి మానసికంగా ధైర్యంగా ఉండాలి.
5. మార్కులను బట్టి ఫీల్డ్‌ను మార్చుకోవాలి.
6. వచ్చిన ఫలితాలను విశ్లేషించుకోవాలి.
7. జరిగిన పొరపాటును సరిదిద్దుకోవాడానికి మార్గం ఎంచుకోవాలి.
8. కేవలం ఇంజనీర్, డాక్టర్ చదువే కాదు. ఎదగడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.
9. పరీక్షలు రాయడం వరకు మాత్రమే విద్యార్థుల పాత్ర
10. అంచనాల ప్రకారం ఫలితాలకు మీరు కాదు బాధ్యులు
11. ఇతరులతో పొల్చుకోవద్దు- మిమ్ములను మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు.
ఇది మీ లోపం కాదు….
1. చదివిన కాలేజీ, ఇంట్లో వాతావరణం, స్నేహితుల ప్రభావం…
2. ఫెయిల్ అయ్యానని ఒక మూలకు దిగులుగా కూర్చోవద్దు.
3. ఒంటరిగా ఉంటే ఆందోళన పెరుగుతుంది.
4. కనిపించకుండా మాయం కావద్దు. నలుగురిలో తిరగండి, హాయిగా ఉండండి.
తల్లిదండ్రులూ.. ఇలా చేయండి
1. ఫలితాలకు వారిని బాధ్యున్ని చేయవద్దు.
2. అతన్ని మందలించవద్దు.. అక్కున చేర్చుకోవాలి.
3. ఫలితాలు వచ్చిన తరువాత వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి.
4. కుటుంబ సభ్యులు, స్నేహితులు వారి బాధను గమనించాలి.
5. మేం నీకు ఉన్నామనే నమ్మకాన్ని వారికి కల్గించాలి.
6. వారి ఆవేదన తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి.
7. వారికి మార్గదర్శకం చేయాలి. మానసిక ధైర్యం కల్పించాలి.
8. ఆనందం కల్గించే విధంగా వ్యవహరించాలి.
9. అవసరమైతే ఇతర ప్రాంతాలకు వారిని తీసుకుపోవాలి.
10. పిల్లలకు బ్యాడ్ సిగ్నల్ ఇవ్వద్దు.
11. రిజిల్ట్స్ వచ్చిన క్షణం నుంచి 78 గంటల పాటు పిల్లలతోనే గడపాలి.
వీరిని గమనించండి
1. ఆత్మహత్య చేసుకునే వారు ఈ ప్రపంచంతో సంబంధం లేన్నట్లుగా ఉంటారు
2. ఎప్పుడు ఒంటరిగా ఉండాలని భావిస్తారు.
3. ఎవరితో చనువుగా ఉండకపోవడం.. నలుగురిలో కలిసి తిరగకపోవడం..
4. పిచ్చి చూపులు చూడడం, ఆకాశం వైపు తల ఎత్తి చూడడం..
5. చీకటిని, ఒంటరి తనాన్ని కోరకోవడం..
6. ఎవరితో మాట్లాడకుండా తనలో తానే గుణుక్కోవడం..
7. మతి మరుపుగా వ్యవహరించడం..
8. ఆకలి కాకపోవడం…
9. చదువు మీద ఆసక్తి లేకపోవడం
The post పరీక్షలు మళ్లీ వస్తాయ్.. లైఫ్ మళ్లీ రాదోయ్! ఫెయిల్ అవడం విద్యార్థుల లోపం కాదు….? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2ULquun
No comments:
Post a Comment