వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మధ్య ట్విటర్ వేదికగా శుక్రవారం ఆసక్తికర సంవాదం నడిచింది. విజయసాయి విమర్శలకు జేడీ చాలా చురుకుగా, నేర్పుగా స్పందించారు. ఇద్దరి మధ్య ‘లెక్కల’ విషయంలో మొదలైన వాగ్బాణాలు.. లోతైన అంశాలను గుర్తుకు తెచ్చాయి. జగన్ అక్రమాస్తుల కేసుల్లో విజయసాయి ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. ఆనాటి కేసును లక్ష్మీనారాయణే దర్యాప్తు చేశారు. ఆ నేపథ్యంలోనే విమర్శలు సాగాయి. తొలుత లక్ష్మీనారాయణను ఉద్దేశిస్తూ విజయసాయి ట్విటర్‌లో విమర్శలు చేశారు. ‘సొంతంగా పోటీచేసిందే 65 సీట్లలో. పవన్ కల్యాణ్ అనుంగ అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెలిచి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నాడు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్లు రాశాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?’ అని కామెంట్ పోస్ట్ చేశారు.
దీంతో మా లెక్కలు సరిగ్గానే ఉంటాయని లక్ష్మీనారాయణ ట్విటర్‌లోనే బదులిచ్చారు. ‘గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిగారూ జనసేన పార్టీ పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద. మిత్రపక్షాలైన బీఎస్పీ 21, సీపీఐ, సీపీఎం వామపక్షాలు 14. అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది. మా లెక్కలు కచ్చితంగా ఉంటాయి. మా లెక్కలు సరిగ్గా ఉంటాయి’ అని ట్వీట్ చేశారు. మళ్లీ ఏమనుకున్నారో ఏమోగానీ.. ఆ వెంటనే ఇంకో ట్వీట్ చేశారు లక్ష్మీనారాయణ. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చుకోండి అంటూ విజయసాయికి చురకలు వేశారు. ‘మీరు సీఏ చదివారు. అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్థం అవ్వట్లేదు. మీ లెక్కలు సరిచూసుకోండి. ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్లం కాబట్టి. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతో మంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టిండి’ అని లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు.
The post సాయిరెడ్డి x లక్ష్మీనారాయణ, సాయిరెడ్డికి జేడీ సిసలైన కౌంటర్, ఏం జరిగిందో చుడండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2GuxDp8
No comments:
Post a Comment