పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రులో జన్మించిన ఎమ్మెస్ అలియాస్ మైలవరపు సూర్యనారాయణ.. టీచర్ గా కెరీర్ మొదలుపెట్టి, కష్టపడి లెక్చరర్ గా మారాడు. ఎమ్మెస్ కు ముందు నుంచీ సాహిత్యాలాభిలాష ఉంది. కొన్ని నాటకాలూ రాశారు. రచయితగా ప్రూవ్ చేసుకోవాలని ఉద్యోగం చేస్తూనే సెలవుల్లో మద్రాస్ లో మకాం పెట్టేవారు. అతని అదృష్టం వేరేలా ఉంది. అందుకే రచయితగా ఎన్నో కష్టాలు పడితేగానీ అవకాశాలు రాలేదు. రచయితగా ఛాన్సులు వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు. రైటర్ గా కొంతకాలం రవిరాజా పినిశెట్టి క్యాంప్ లో ఉండేవారు. ఓసారి ఆయన చేస్తోన్న ఎమ్ ధర్మరాజు ఎమ్మే సినిమాలో ఎమ్మెస్ తో బలవంతంగా వేషం వేయించారు. అప్పటి వరకూ ఆ అనుభవం లేదు. అయినా అదిరిపోయే టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అనుకోని ఆ టాలెంట్ కు రవిరాజా ఆశ్చర్యపోయాడు. వెంటనే పెదరాయుడులో చాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో చిన్న అవకాశాలు వచ్చాయి. అయితే బ్రేక్ అనదగ్గ పాత్రలు పడలేదు. పడ్డా సినిమాలు హిట్ కాలేదు.
ఇవివి సత్యనారాయణ తెరకెక్కించిన మా నాన్నకు పెళ్లి… తెలుగు తెరకు మరో గొప్ప కమెడియన్ ను ఇచ్చింది. తాగుబోతు పాత్రలో ఎమ్మెస్ చేసిన హడావిడీ అంతా ఇంతా కాదు… తాగుబోతు పాత్రలను అంతకు ముందు ఎంతమంది చేసినా.. ఇంత అద్భుతంగా పండించవచ్చా అనుకునేలా చేశాడు ఎమ్మెస్. నిజానికి ఎమ్మెస్ రుక్మిణి, కౌరవుడు సినిమాలోనే తాగుబోతుగా నటించారు.. కానీ మా నాన్నకు పెళ్లే తొలి బ్రేక్.. ఇక ఆ తర్వాత ఆయన కెరీర్ మూడు పెగ్గులు ఆరు లార్జ్ లుగా సాగిపోయింది. ఫలానా సినిమాలో బాగా చేశాడు అనే ఛాన్స్ ఇవ్వకుండా వచ్చిన ప్రతి సినిమాలోనూ అదరగొట్టాడు ఎమ్మెస్. సీన్ ఏదైనా.. అది సితారవ్వాల్సిందే. ఇక కాంబినేషన్ సీన్స్ లో అయితే ఎమ్మెస్ చెలరేగిపోయేవారంతే. ఏవియస్, బ్రహ్మానందం, సుధాకర్, ఎల్బీ శ్రీరామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునిల్.. ఇలా కాంబినేషన్ ఎవరితో అయినా ఎమ్మెస్ కామెడీ లేని సినిమా లేకుండా పోయింది. ఆ వేగమే.. అతన్ని అప్పటికే పాతుకుపోయిన సీనియర్ కమెడియన్స్ సరసన చాలా త్వరగా నిలబెట్టింది. వారి స్థాయిలో స్టర్డమూ తెచ్చింది.
2000ల తర్వాత పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. కొత్త దర్శకులు, నిర్మాతలు, నటులు, టెక్నీషియన్స్ చాలామంది వచ్చిన తరుణమది. అంటే ఫ్రెష్ టాలెంట్ అన్నమాట. అయితే కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ పాతవారితోనూ కొత్తగా కామెడీ చేయించారు. అలా ఎమ్మెస్ కు మరోసారి ఎవర్ గ్రీన్ గా చెప్పుకునే పాత్ర ఆనందం సినిమాలో దక్కింది. రాంబాబూ అంటూ గాజు పెంకులపై ఎమ్మెస్ చేసిన కామెడీ ఎప్పుడు తలచుకున్నా కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటాం.. 2000ల తర్వాత కామెడీ కాంబినేషన్స్ అన్నీ సూపర్ గా వర్కవుట్ అయ్యాయి. వారిలో అద్భుతమైన కామెడీ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు ఎమ్మెస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం. వీరి కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ అన్నీ సూపర్ హిట్ కావడమే కాదు.. ఆ సినిమాల విజయంలోనూ కీలకపాత్ర పోషించాయి. అలాగే ఎమ్మెస్, సునిల్ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ జోడీగానే పేరు తెచ్చుకుంది.
ఇక ఎమ్మెస్ చేత శ్రీను వైట్ల చేయించిన మరో హిలేరియస్ కామెడీ దూకుడు సినిమాలోనిది. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ ఉన్న చోట కమెడియన్స్ కు పెద్దగా స్కోప్ ఉండదు. కానీ శ్రీను వైట్ల సినిమాల్లో కథలో భాగంగానే కామెడీ ఉంటుంది కాబట్టే, దూకుడులో ఎమ్మెస్ పాత్ర ఆ స్థాయిలో పండింది. మహేష్ తర్వాత సినిమాకు ప్లస్ పాయింట్ అంటే ఎమ్మెస్సే అనేంతగా దూకుడులో చెలరేగిపోయారు ఎమ్మెస్.తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లోనూ ఎమ్మెస్ పాత్రలు పండించిన కామెడీ మర్చిపోలేం. సింగిల్ సీన్ అయినా.. ఎక్కువ సీన్స్ ఉన్నా.. ఆయన చేస్తే ఆ పాత్రకు, క్యారెక్టర్ కు ఎనలేని గుర్తింపూ.. నవ్వూ వస్తాయి.. ఇందుకు సింగిల్ ఎగ్జాంపుల్ .. అతడు.. అసలేం జరుగుతుంది.. నాకు తెలియాలి.. నాకు తెలియాలి.. సింగిల్ సీన్ లో ఊగిపోయిన ఎమ్మెస్ సినిమా అంతా గుర్తుండిపోయేలా ఇంపాక్ట్ చూపించారు.
దర్శకులెవరైనా.. ఎమ్మెస్ పాత్రలను ప్రత్యేకంగానే డిజైన్ చేసుకున్నారు. ఈయనా అంతే.. తనకు వచ్చిన పాత్రలపై కాన్ సెంట్రేట్ చేస్తారే కానీ, దర్శకులను బట్టి వ్యవహారం ఉండదు. అందుకే కేవలం 17యేళ్లలోనే 700వందల సినిమాల్లో నటించిన కమెడియన్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. నిజానికి సినిమా ఏదైనా .. ఎమ్మెస్ కామెడీ ఎప్పుడూ బోర్ కొట్టలేదు. అది కూడా ఎమ్మెస్ మాగ్జిమమ్ నంబర్ ఆఫ్ మూవీస్ లో యాక్ట్ చేయడానికి కారణంగా చెప్పొచ్చు. ఎమ్మెస్ నారాయణకు సంబంధించి నటనంటే సరస్వతి. నటనలో ఉంటే ఆయన తనకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలన్నీ మర్చిపోతారు. పర్ సపోజ్.. ఆయన మందు తాగే సీన్స్ ను అద్భుతంగా పండిస్తారు. దీంతో చాలామంది నిజంగా మందు తాగే నటిస్తున్నారేమో అనుకుంటారు. కానీ నటిస్తున్నప్పుడు ఎప్పుడూ.. మందుజోలికి వెళ్లరు. ఆ పాత్రలో ఆయన నటించారే కానీ వెండితెరపై జీవించలేదు.. అందుకే ఈ పాత్రలో ఆయనెప్పుడూ అతిగా అనిపించలేదు.
స్వతహాగా రచయిత కావడంతో కథలు రాసుకోవడం మాత్రం ఆపలేదాయన. అందుకే తన కొడుకును హీరోగా పెట్టి తనే రాసుకున్న కథతో కొడుకు అనే సినిమాను నిర్మించి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కూడా భజంత్రీలు అనే సినిమా డైరెక్ట్ చేశారు. కానీ ఈ రెండు రంగాల్లోనూ ఆయన పెద్దగా క్లిక్ కాలేదు. దీంతో తనయుడిని నటుడిగా చూడాలన్న కోరిక పూర్తిగా తీరనేలేదు. ఎంతో మంది కమెడియన్స్ ఉన్న టాలీవుడ్ లో ఎమ్మెస్ అన్ని సినిమాల్లో నటించడానికి మరో కారణం కూడా ఉంది. అదే క్రమశిక్షణ. ఎవరినీ నొప్పించని మనస్తత్వం. ఇవే ఆయన్ని చాలామంది ఇష్టపడేలా చేశాయి. కమెడియన్స్ కూడా మెచ్చేలా చేశాయి. ఆ క్రమశిక్షణనే తన పిల్లలకూ నేర్పించారు. అందుకే కొడుకునే కాదు కూతురూ సినిమా దర్శకురాలినవుతానంటే నో చెప్పలేదు. దగ్గరుండి మరీ ప్రోత్సహించారు. 46యేళ్ల వయసులో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఎమ్మెస్ .. తనకంటే చాలా చిన్న వయసులోనే పరిశ్రమకు వచ్చిన చాలామంది కంటే ఎక్కువే సాధించారు. రచయిత కావాలని వచ్చి, నటుడిగా ఎన్నో అవార్డులూ రివార్డులూ పొందడం అంటే అదృష్టం మాత్రమే కాదు.. అతని స్వయంకృషి కూడా అందుకు కారణమే. ఏదేమైనా .. ఇంకా మనకెన్నో నవ్వులు బాకీ ఉన్న ఎమ్మెస్ ను అంత తొందరగా తీసుకుపోయిన దేవుడు మాత్రం ఎప్పటికీ క్షమార్హుడు కాదు..
The post నవ్వులు పూయించిన MS చనిపోయే ముందు పడ్డ బాధ తెలిస్తే కన్నీళ్లు ఆగవు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2GhOs6n
No comments:
Post a Comment